క్రీడాభూమి

పిబిఎల్‌లో ‘ట్రంప్ మ్యాచ్’ ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 1: రెండేళ్ల విరామం తర్వాత శనివారం ఇక్కడ తిరిగి ప్రారంభం కానున్న ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పిబిఎల్) తొలి పోటీలో పోటీలకు ఆతిథ్యం ఇస్తున్న ముంబయి రాకెట్స్ జట్టు, సైనా నెహ్వాల్ నేతృత్వంలోని అవధే వారియర్స్‌తో తలపడనుంది. కాగా, ఒక పోటీలో చివరి దాకా ఆసక్తిని కొనసాగించే ఉద్దేశంతో ఈ లీగ్ టోర్నమెంట్‌లో ‘ట్రంప్‌మ్యాచ్’ అనే కొత్త ప్రయోగం చేయనున్నారు. 2013లో జరిగిన తొలి ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ విజయవంతం అయిన తర్వాత రెండేళ్ల విరామం తర్వాత పిబిఎల్‌ను తిరిగి పునరుద్ధరించడం తెలిసిందే. ఈ ట్రంప్ మ్యాచ్ ప్రయోగంలో పోటీ పడుతున్న రెండు టీమ్‌లు ఒక మ్యాచ్‌ని ట్రంప్ కార్డుగా నామినేట్ చేస్తాయి. తాము ట్రంప్‌కార్డుగా ఎంపిక చేసుకున్న మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌కు ఒక అదనపు పాయింట్ ఇస్తారు. అయితే ఆ పోటీలో ఓడిపోయే జట్టు ఒక పాయింట్ వెనకబడుతుంది. పోటీ చివరి దాకా ఆసక్తిని కొనసాగించడమే ఈ కొత్త ఆలోచన ఉద్దేశం అని జాతీయ కోచ్ పుల్లెల గోపీచంద్ అంటున్నాడు. పోటీ ముగిసే దాకా ఉత్సుకత కొనసాగేలా చూడడం వల్ల ఇది లీగ్‌కు అదనపు ఆకర్షణ అవుతుందని ఆయన అన్నాడు. రెండు జట్లు కూడా ఒకే మ్యాచ్‌ని ట్రంప్ మ్యాచ్‌గా నామినేట్ చేస్తాయని, దీనివల్ల ఒక వేళ ఒక జట్టు 3-0 మ్యాచ్‌ల ఆధిక్యత సాధించినప్పటికీ మిగతా రెండు మ్యాచ్‌లూ ముఖ్యంగా మారుతాయని గోపీచంద్ చెప్పాడు. ఈ అదనపు ఒత్తిడికి ఆటగాళ్లు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాల్సి ఉందని గోపీచంద్ చెప్పాడు.
కాగా, వేలంలో లక్ష డాలర్లు పలికిన ప్రపంచ నంబర్ టూ ర్యాంకర్ సైనా నెహ్వాల్ అవధే వారియర్స్ జట్టుకు గొప్ప బలమని చెప్పాలి. మరో వైపు దేశంలో టాప్ టూ ఆటగాళ్లయిన హెచ్‌ఎస్ ప్రణయ్, ఎంవి గురుదత్ సాయిలతో ముంబయి రాకెట్స్ పురుషుల సింగిల్స్ విభాగంలో బలంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అలాగే డెన్మార్క్‌కు చెందిన మథియాస్ బో, రష్యాకు చెందిన వ్లాదిమిర్ ఇవనోవ్‌లతో ఆ జట్టు డబుల్స్ విభాగంలోను బలంగానే ఉంది. అవధే వారియర్స్ జట్టులో సైనాకు తోడుగా పురుషుల సింగిల్స్ విభాగంలో సాయి ప్రణీత్, సౌరభ్ వర్మ, థాయిలాండ్‌కు చెందిన తానోంగ్‌సక్ సరుూన్‌సోంబూన్‌సుక్‌లున్నారు. కాగా, ఆదివారం నాడు ఉదయం హైదరాబాద్ హంటర్స్, బెంగళూరు టాప్ గన్స్ జట్లు తలపడనుండగా సాయంత్రం చెన్నై స్మాషర్స్, ముంబయి రాకెట్స్‌ను ఢీకొంటుంది. కాగా హైదరాబాద్ హంటర్స్ గాయం కారణంగా కొంతకాలం ఆటకు దూరంగా ఉన్న ప్రపంచ నంబర్ 15 ఆటగాడు పారుపల్లి కశ్యప్‌పైనే ప్రధానంగా ఆధారపడుతోంది. ఈ జట్టులో అంతర్జాతీయంగా ఎంతో అనుభవం ఉన్న డెన్మార్క్‌కు చెందిన కార్‌స్టెన్ మోగెన్‌స్టెన్, జ్వాలాగుత్తా కూడా ఉన్నారు. కాగా, రెండు నెలల క్రితం ప్రెంచ్ ఓపెన్ సందర్భంగా తన ఎడమకాలి పిక్కకు తగిలిన గాయం పెద్ద ఎదురు దెబ్బేనని కశ్యప్ అంటూ, పిబిఎల్ తర్వాత వచ్చే ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయ్యేందుకు మిగిలిన 11 టోర్నమెంట్లలో ఎన్నింటిలో ఆడాలో ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పాడు.