క్రీడాభూమి

ఒలింపిక్స్‌కు రియో రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 4: బ్రెజిల్‌లోని రియో డి జెనీరో 33వ ఒలింపిక్స్‌కు సిద్ధమైంది. శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ఈ మెగా ఈవెంట్‌లో విజయభేరి మోగించి, పతకాలను కొల్లగొట్టడానికి ప్రతి ఒక్కరూ సర్వశక్తులు ఒడ్డుతారు. అందుకే ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను మించిన అతి పెద్ద క్రీడా పండువగా ఒలింపిక్స్ అవతరించింది. సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒలింపిక్ క్రీడలు అసలుసిసలైన క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. అనాదిగా ఆటపాటలు మనిషి జీవితంలో భాగమయ్యాయి. పశుపక్షాదులు కూడా ఆడుకోవడం మనకు తెలుసు. మేధాశక్తిని సంతరించుకున్న మనిషి ఈ ఆటలకు ఒక రూపాన్ని ఇచ్చాడు. నియమనిబంధనల చట్రంలోకి వీటిని తెచ్చాడు. ఆటలే మనిషికి మానసిక, శారీరక ప్రశాంతతను, భవిష్యత్తుకు అవసరమైన స్ఫూర్తిని అందిస్తాయి. అందుకే నిత్యం యుద్ధాల్లో తలమునకలయ్యే రాజుల కాలం నుంచి అత్యాధునిక పోకడలను సంతరించుకున్న నేటి తరం వరకూ క్రీడలు మనిషికి ఉత్ప్రేరకంలా పని చేస్తునే ఉన్నాయి. క్రీస్తుపూర్వం ఎనిమిదో శతాబ్దంలో ప్రపంచంలోని మిగతా ప్రాంతాల్లో మాదిరిగానే గ్రీకు కూడా అనేక చిన్నచిన్న రాజ్యాలుగా విడిపోయి ఉండేవి. వీటి మధ్య తరచు యుద్ధాలు జరుగుతూ ఉండేవి. క్రీడల వల్లే శాంతి స్థాపన సాధ్యమని గ్రహించిన గ్రీకులు క్రీస్తుపూర్వం 776లో మొదటిసారి భారీ క్రీడాపోటీలను నిర్వహించారు. అప్పటి నుంచి క్రీస్తుశకం 393 వరకూ ప్రతి నాలుగేళ్లకోసారి ఒలింపిక్ క్రీడలు జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. పరుగు పందెం, కుస్తీ, బాక్సింగ్, గ్రురం స్వారీ, విలువిద్య వంటి పలు అంశాల్లో పోటీలు ఉండేవి. రోమన్ చక్రవర్తి థియోడొసియస్ గ్రీకు సామ్రాజ్యాన్ని జయించి ఒలింపిక్ క్రీడలను నిషేధించడంతో ఒక గొప్ప క్రీడోత్సవానికి తెరపడింది. ప్రాచీన ఒలింపిక్స్ జరిగిన ఒలింపస్ పట్టణం తర్వాతి కాలంలో భూకంపాల కారణంగా శిథిలమై నామరూపాలు లేకుండా పోయింది. అయితే, గ్రీకులో పురాతత్వశాఖ జరిపిన తవ్వకాల్లో ఆనాటి ఒలింపిక్ క్రీడలకు సంబంధించిన ఎన్నో విశేషాలు బహిర్గతమయ్యాయి. క్రీడాలోకానికి దిశానిర్దేశనం చేశాయి. ఫ్రాన్స్‌కు చెందిన క్రీడా పండితుడు పియరీ డి కోబర్టీన్‌కు ఒలింపిక్ క్రీడలను పునరుద్ధరించాలన్న ఆలోచన కలిగింది. 1892లో మళ్లీ ఒలింపిక్స్‌ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించి, తన కలను నిజం చేయడానికి విశేషంగా కృషి చేశాడు. ప్రాచీన ఒలింపిక్స్ జరిగిన ప్రాంతంలోనే 1896లో మొట్టమొదటి ఆధునిక ఒలింపిక్ క్రీడలను నిర్వహించడం విశేషం.
ఆధునిక ఒలింపిక్ క్రీడలకు ఒడిదుడుకులు తప్పలేదు. వీటిలో ప్రధానంగా రాజకీయ కారణాలవల్లే ఒలింపిక్స్‌కు సమస్యలు ఎదురయ్యాయి. 1916లో బెర్లిన్‌లో జరగాల్సిన ఒలింపిక్ క్రీడలను మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా రద్దు చేశారు. 1940లో హెల్సింకీ, 1944లో లండన్ ఒలింపిక్స్ రెండో ప్రపంచ యుద్ధం వల్ల జరగలేదు. 1956 మెల్బోర్న్ ఒలింపిక్స్‌ను స్పెయిన్, స్విట్జర్లాండ్ తదితర దేశాలు బహిష్కరించాయి. హంగరీ మీద అప్పటి సోవియట్ యూనియన్ దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. 1964 నుంచి 1980 వరకూ జాతి వివక్ష కారణంగా దక్షిణాఫ్రికాను ఒలింపిక్స్‌లో పాల్గొనకుండా నిషేధించారు. 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌ను ఆఫ్రికా దేశాలు బహిష్కరించాయి. అఫ్గానిస్థాన్ ఆంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమేగాక, ఆ దేశంపై సోవియట్ యూనియన్ దాడికి దిగడాన్ని నిరసిస్తూ 1980 మాస్కో ఒలింపిక్స్‌కు అమెరికా, దాని మిత్ర దేశాలు హాజరుకాలేదు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌ను వ్యతిరేకిస్తూ టిబెటన్లు ప్రపంచ వ్యాప్తంగా ఆందోళనకు దిగారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఆ పోటీలను నిర్వహించినా, అదే పరిస్థితి ఇంగ్లాండ్ ఒలింపిక్స్‌పై ప్రభావం చూపింది. రియో పరిస్థితి మరింత దారుణంగా మారింది. అయితే, ఎన్ని ఆటుపోట్లకు గురవుతున్నప్పటికీ ఒలింపిక్స్‌కు ఉన్న ఆదరణ ఏమాత్రం తగ్గలేదు. ఈ క్రీడోత్సవం రోజురోజుకూ మరింత ప్రాభవాన్ని సంతరించుకుంటూనే ఉంది.
ఎన్నో అవాంతరాలు ఎదుర్కొంటున్నప్పటికీ క్రీడా ప్రతిభకు నిర్వచనమైన ఒలింపిక్స్‌కు ఈసారి రియో వేదికైంది. సమస్యల ఊబిలో చిక్కుకొని ఉక్కిరిబిక్కిరవుతున్న ఈ నగరం ఒలింపిక్స్‌ను ఎంత వరకు విజయవతం చేస్తుందో చూడాలి.
***
రియోలో మొత్తం 33 వేదికలను ఒలింపిక్స్‌కు నిర్వహణ కమిటీ సిద్ధం చేసింది. 28 క్రీడలు, 41 క్రీడాంశాల్లో 306 జతల పతకాల కోసం రియోతోపాటు మరో ఐదు నగరాలను కూడా బ్రెజిల్ ప్రభుత్వం ఎంపిక చేసింది. కొన్ని ప్రాంతాల్లో పోటీలకు కేంద్రాలు తుది మెరుగులు దిద్దుకుంటున్నాయి. ఈ పోటీల్లో రగ్బీ సెవెన్స్ మొదటిసారి రంగ ప్రవేశం చేస్తున్నది. గోల్ఫ్ ఏకంగా 112 సంవత్సరాల తర్వాత మళ్లీ ఒలింపిక్స్‌లోకి అడుగు పెట్టింది. ఈ రెంటినీ చారిత్రక ఘట్టాలుగా విశే్లషకులు అభివర్ణిస్తున్నారు. ఎన్నో సమస్యలు ఎదురవుతున్నప్పటికీ క్రీడాభిమానులను అలరించడానికి రియో ఒలింపిక్స్ విందు సిద్ధంగా ఉంది.
***
ముస్తాబైన నగరం
* ఒలింపిక్స్ కోసం రియో నగరం అందంగా ముస్తాబైంది. సమస్యలను అధిగమిస్తూ, వివిధ దేశాల నుంచి వచ్చే అథ్లెట్లు, అధికారులు, అభిమానులకు ఆతిథ్యమివ్వడానికి సిద్ధమైంది. కుడివైపు టూ బ్రదర్స్, ఎడమ వైపు కోర్కొవాడో, మధ్యన సుగర్‌లూఫ్ పర్వత శ్రేణులు అందంగా కనిపిస్తుంటే, క్రీస్ట్ ది రిడీమర్ భారీ విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. బొటాలొగో తీరం రియో ప్రాధాన్యతను మరింత పెంచుతున్నది. మున్సిపాలిటీలో 1,221 కిలోమీటర్లు, మెట్రోలో 4,557 కిలోమీటర్ల విస్తీర్ణంగల రియో జనాభా సుమారు 65 లక్షలు. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు 207 దేశాలకు చెందిన 10,500 మంది అథ్లెట్లు ఇప్పటికే రియో చేరుకున్నారు. దాదాపు అదే సంఖ్యలో అధికారులు, అభిమానులు కూడా రియోలో అడుగుపెడుతున్నారు. ఆర్థిక, రాజకీయ రంగాల్లో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నప్పటికీ ఒలింపిక్స్‌ను విజయవంతం చేసేందుకు బ్రెజిల్ సర్కారు కృతనిశ్చయంతో ఉంది.