క్రీడాభూమి

భారత్‌కు ఎనిమిది పతకాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 5: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు ఎనిమిది పతకాలు లభిస్తాయని ‘ఒలింపిక్స్, ఎకనామిక్స్ రిపోర్ట్’ నివేదిక అంచనా వేసింది. వీటిలో ఒకటి స్వర్ణమని జోస్యం చెప్పింది. 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో జితూ రాయ్, టెన్నిస్ మిక్స్‌డ్ డబుల్స్ ఈవెంట్‌లో సానియా మీర్జా, రోహన్ బొపన్న జోడీ పతకాలు సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది. లండన్ కంటే రియోలో భారత్ ఉత్తమ ప్రతిభ కనబరుస్తుందని ఆ నివేదిక స్పష్టం చేసింది.
రాష్టప్రతి శుభాకాంక్షలు
రియో ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత బృందానికి రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ శుక్రవారం చెఫ్ డె మిషన్ రాకేష్ గుప్తాకు పంపిన సందేశంలో శుభాకాంక్షలు తెలిపారు. భారత అథ్లెట్లు ప్రతి ప్రతిభాపాటవాలను నిరూపించుకోవడానికి ఒలింపిక్స్‌ను సరైన వేదికగా తీసుకుంటారన్న ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రత్యక్ష ప్రసారాలు
మూడు వారాలు కొనసాగే ఒలింపిక్స్‌ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. డిజిటల్ కనెక్టివిటీ హాట్‌స్టార్‌తో ఉంది. ప్రయాణంలో ఉన్న కారణంగా టీవీలో ఒలింపిక్స్ ప్రసారాలను చూసే అవకాశం లేనివారు హాట్‌స్టార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒలింపిక్స్ క్రీడలను ఎప్పటికప్పుడు తిలకించి ఆనందించవచ్చు.