క్రీడాభూమి

తొలిసారి బరిలోకి శరణార్థుల బృందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: ఒలింపిక్స్ చరిత్రలోనే మొట్టమొదటిసారి శరణార్థుల జట్టు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) పతాకం కింద పోటీపడుతున్నది. వివిధ కారణాలతో స్వదేశాలను విడిచి, ఇతర దేశాల్లో తలదాచుకునే వారికి ఇన్నాళ్లూ ఒలింపిక్స్‌లో పాల్గొనే అవకాశం దక్కలేదు. కొంత మందికి అవకాశం దొరికినా, వారు తమ సొంత దేశం తరఫున కాకుండా, శరణార్థిగా ఉన్న దేశం తరఫున బరిలోకి దిగారు. అయితే, మొట్టమొదటిసారి శరణార్థులకు ఐఒసి అవకాశం కల్పించింది. మార్చ్‌పాస్ట్‌లో ఈ బృందం కనిపించిన వెంటనే స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది.

chitram శరణార్థుల జట్టు