క్రీడాభూమి

కిప్చోగ్ కెనోకు ‘లారెల్ ట్రోఫీ’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం చివరిలో ‘లారెల్ ట్రోఫీ’ని స్వీకరించే అవకాశం కెన్యా ఒలింపిక్ కమిటీ చైర్మన్ కిప్చోగ్ కెనోకు దక్కింది. కెన్యా రన్నింగ్ లెజెండ్‌గా పేరు తెచ్చుకున్న 76 ఏళ్ల కెనో 1968 మెక్సికో ఒలింపిక్స్‌లో 1,500 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 1972 మ్యూనిచ్ గేమ్స్‌లో 3,000 మీటర్ల స్టీపుల్ చేజ్‌లో విజేతగా నిలిచాడు. ఐఒసి మొట్టమొదటిసారి ప్రవేశపెట్టిన ‘లారెల్ ట్రోఫీ’కి ఒలింపిక్స్‌లో రెండు స్వర్ణ పతకాలను సాధించిన కెనోను ఎంపిక చేశారు. కెనో కేవలం అథ్లెట్ మాత్రమే కాదు.. సామాజిక కార్యకర్త కూడా. విద్య, సంస్కృతి, ప్రపంచ శాంతి రంగాల్లో అతను విశేష సేవలు అందిస్తున్నాడు. క్రీడల ద్వారా ఏదైనా సాధ్యమేనని నిరూపించిన అతనికి ఐఒసి సరైన గుర్తింపునిచ్చి తనను తాను సత్కరించుకుంది.
‘సాంబా’ నృత్యాలు, ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన బ్రెజిల్ ఒలింపిక్స్‌లోనూ ఈ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో కార్యక్రమాన్ని రూపొందించింది. సాంబా స్కూల్ ఈవెంట్‌లో సంప్రదాయ దుస్తులు ధరించిన కళాకారులు కనువిందు చేశారు.
బోల్ట్ లేకుండానే..
‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ లేకుండానే జమైకా బృందం మార్చ్‌పాస్ట్‌లో పాల్గొంది. చాలా మంది అభిమానులు తాము ఎంతగానో ఆరాధించే స్ప్రింటన్ బోల్ట్‌ను చూడాలని ఉత్సాహపడ్డారు. అయితే, మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్న 60 మంది జమైకా బృందంలో అతను లేడని తెలుసుకొని నీరసపడిపోయారు.