క్రీడాభూమి

ఖాళీ సీట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియో ఒలింపిక్స్ ప్రారంభోత్స కార్యక్రమం అట్టహాసంగా జరిగినప్పటికీ, మరకానా స్టేడియంలో ఎక్కువ భాగం సీట్లు ఖాళీగా కనిపించాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా పతనమైన దశలో ఒలింపిక్స్ నిర్వాహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేయడాన్ని స్థానిక ప్రజలు నిరసిస్తున్న విషయం తెలిసిందే. వివిధ శాఖల ఉద్యోగులు, కార్మికుల ప్రదర్శనలతో రియో అట్టుడికిపోతున్నది. స్టేడియం వెలుపల నిరసనకు దిగిన వారిపై భద్రతా సిబ్బంది టియర్ గ్యాస్ ప్రయోగించారు. లాఠీలకు పని చెప్పారు. ఒలింపిక్స్‌ను వ్యతిరేకిస్తున్న వర్గం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరుకావద్దని ఇచ్చిన పిలుపు తీవ్ర ప్రభావం చూపింది. చాలా వరకు సీట్లు ఖాళీగా కనిపించాయి. టికెట్ల అమ్మకాలకు నిర్వాహకులు విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఒలింపిక్స్‌ను నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని వాదిస్తున్న చాలా మంది స్థానికులు ఈ పోటీలను బహిష్కరించారు. అంతేగాక, ఎవరూ స్టేడియాలకు వెళ్లవద్దని పిలుపునిచ్చారు. టికెట్ల అమ్మకాలపై ఈ పిలుపు ప్రభావం కనిపిస్తున్నదని నిర్వాహకులు అంటున్నారు.
ఆరంభంలోనే డోప్ కేసు
ఈసారి ఒలింపిక్స్‌ను డోప్ రహిత క్రీడా ఈవెంట్‌లో నిర్వహిస్తామని ఐఒసి చేసిన ప్రకటనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. గ్రీస్ నుంచి వచ్చిన ఓ అథ్లెట్ డోప్ పరీక్షలో పట్టుబడ్డాడు. ఒలింపిక్స్ ప్రారంభం రోజునే ఈ ఫలితం వెలువడడం విశేషం.

చిత్రం..సీట్లు నిండక బోసిపోయన మరకానా స్టేడియం