క్రీడాభూమి

ముందు బింద్రా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: రియోలో భారత జాతీయ పతాకం రెపరెపలాడింది. బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించిన స్టార్ షూటర్ అభినవ్ బింద్రా త్రివర్ణ పతాకాన్ని పట్టుకొని ముందు నడవగా, భారత బృందం అతనిని అనుసరించింది. అల్ఫాబెటికల్ ఆర్డర్‌ను అనుసరించి భారత్ 95వ దేశంగా స్టేడియంలోకి అడుగుపెట్టింది. ఒలింపిక్స్ కోసం ఇక్కడికి చేరుకున్న 118 మంది అథ్లెట్లలో 70 మంది మార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. వీరితోపాటు 24 మంది అధికారులు కూడా మార్చ్‌పాస్ట్‌లో నడిచారు. పురుషులు నీలం రంగు బేజర్లు, ప్యాంట్లు ధరిస్తే, మహిళలు నీలం బ్లేజర్లు ధరించారు. వారంతా సంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకొని పార్చ్‌పాస్ట్‌లో పాల్గొన్నారు. వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ ఈ బృందంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. అతను రికార్డు స్థాయిలో ఏడోసారి ఒలింపిక్స్‌లో పాల్గొనడం గమనార్హం. మహిళల్లో బాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్టు జోడీ జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప, జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ స్టార్ అట్రాక్షన్‌గా నిలిచారు. అధికారుల్లో చెఫ్ డె మిషన్ రాకేష్ గుప్తా, అతని డిప్యూటీ ఆనందేశ్వర్ పాండే ఉన్నారు.
హాకీ ఆటగాళ్లు గైర్హాజరు
భారత హాకీ ఆటగాళ్లు మార్చ్‌పాస్ట్‌కు గైర్హాజరయ్యారు. ఐర్లాండ్‌తో మ్యాచ్ ఉన్నందున వారు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనలేదని భారత అధికారులు ప్రకటించారు. కాగా, ఆర్చరీ, టేబుల్ టెన్నిస్, వెయిట్‌లిఫ్టింగ్ జట్లు కూడా మార్చ్‌పాస్ట్‌కు రాలేదు.

చిత్రం.. భారత బృందం మార్చ్‌పాస్ట్