క్రీడాభూమి

రియోపై అనుమానాలకు తెర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 6: బ్రెజిల్ ఆర్థికంగా, రాజకీయంగా పలు సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో 31వ ఒలింపిక్స్‌కు రియో ఆతిథ్యంపై వ్యక్తమైన అనుమానాలు పటాపంచలయ్యాయి. ఎవరూ ఊహించని విధంగా ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. బీజింగ్, ఇంగ్లాండ్ ఒలింపిక్స్ ప్రారంభోత్సవాలను తలదనే్న విధంగా రియోలో ఆరంభ వేడుకలు కనువిందు చేశాయి. సుమారు 500 మంది కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు అందరినీ మంత్రముగ్ధులను చేశాయి. గ్లోబల్ వార్మింగ్‌పై ప్రపంచ దేశాలను చైతన్యపరిచే విధంగా కార్యక్రమాలను రూపొందించడం విశేషం. ‘గ్రీన్ ఒలింపిక్స్’ అంటూ మొదటి నుంచే ప్రచారం చేసిన నిర్వాహణ కమిటీ తన మాటను నిలబెట్టుకుంది. పలు కళారూపాల ప్రదర్శనలు ఈ సందేశానే్న ఇచ్చాయి. సాకర్‌కు మారుపేరైన బ్రెజిల్ తన పంథాను మార్చుకొని, ఒలింపిక్స్‌లో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయడం విశేషం. 21వ తేదీ వరకు జరిగే ఈ 17 రోజుల క్రీడా పండుగలో 209 దేశాలకు చెందిన సుమారు 11,000 మంది అథ్లెట్లు పోటీపడుతున్నారు.
రియో డి జెనీరోలో ఒకవైపు ఒలింపిక్స్ ప్రారంభోత్సవం జోరుగా సాగుతుండగా మరోవైపు నిరసన ప్రదర్శనలు కూడా అదే స్థాయిలో జరిగాయి. బ్రెజిల్ ఆర్థికంగా పతనావస్థలో ఉంది. వైద్యులు, న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగులు, చివరికి పోలీసులు కూడా మెరుగైన సౌకర్యాలు, వేతనాలు, బకాయిల చెల్లింపులు వంటి అంశాలపై సమ్మెబాట పట్టారు. దాదాపుగా ప్రతి రోజూ నిరసన ప్రదర్శనలు కొనసాగుతున్నాయి. పోలీసులు కూడా సమ్మెకు పూనుకోవడంతో ఇతర ప్రాంతాల నుంచి పోలీసులను, సైన్యాన్ని, ప్రైవేటు భద్రతా సిబ్బందిని రప్పించారు. ఆందోళనలు ఊపందుకుంటున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బ్రెజిల్ సర్కారు పటిష్టమైన చర్యలు చేపట్టింది. ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించి, ఒలింపిక్స్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా పూర్తి చేస్తామన్న సంకేతాన్ని పంపింది. ప్రజల నుంచి సహాయ నిరాకరణ ఎదురవుతున్నప్పటికీ, ఇప్పటికే పిలిపించిన వలంటీర్లు, అధికారులు, సిబ్బందితో ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు పట్టిష్టమైన వ్యూహాన్ని అమలు చేస్తున్నది. లక్షలాది మంది అర్ధాకలితో అల్లాడుతుంటే ఒలింపిక్స్ పేరుతో కోట్లకు కోట్లు ఖర్చు చేయడం ఎంత వరకు సబబని స్థానికులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అయితే, రాజకీయ, ఆర్థిక అనిశ్చితి ఒలింపిక్స్‌పై ప్రభావం చూపకుండా నిర్వాహణ కమిటీ అన్ని చర్యలను చేపట్టింది. ప్రారంభోత్సవ కార్యక్రమం విజయవంతం కావడమే ఇందుకు నిదర్శనం.
**
దక్షిణ అమెరికాలో మొట్టమొదటిసారి జరుగుతున్న ఒలింపిక్స్‌ను బ్రెజిల్ తాత్కాలిక అధ్యక్షుడు మిచెల్ టెమెర్ అధికారికంగా ప్రారంభించాడు. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) అధ్యక్షుడు థామస్ బాచ్, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ తదితరులు హాజరైన ప్రారంభోత్సవ కార్యక్రమంలో 31వ ఒలింపిక్స్ మొదలైనట్టు టెమెర్ ప్రకటించాడు. ఆ వెంటనే కళ్లు మిరుమిట్లు గొలిపే విధంగా బాణాసంచా సంచా వెలుగుల్లో మరకానా స్టేడియం కొత్త అందాలను సంతరించుకుంది.
**
సంప్రదాయాన్ని అనుసరించి, ఒలింపిక్స్ జన్మస్థలమైన గ్రీస్‌కు రియో ఒలింపిక్స్ మార్చ్‌పాస్ట్‌లో తొలుత నడిచే అవకాశం లభించింది. ఆతర్వాత ఆయా దేశాల పేర్లను అనుసరించి, ఆల్ఫాబెట్స్ ప్రకారం దేశాలు కవాతులో పాల్గొన్నాయి. ఆతిథ్య దేశం బ్రెజిల్ చివరిగా మార్చ్‌పాస్ట్ చేసింది.