క్రీడాభూమి

కళంకితుడి పునరాగమనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, జనవరి 1: కళంకిత పేస్ బౌలర్ ముహమ్మద్ అమీర్ (23)కు పాకిస్తాన్ జాతీయ క్రికెట్ జట్టులో మళ్లీ చోటు లభించింది. పరిమిత ఓవర్ల సిరీస్‌లో తలపడేందుకు త్వరలో న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లబోతున్న పాక్ జట్టులో శుక్రవారం అమీర్‌కు స్థానం కల్పించారు. దీంతో స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషిగా తేలి తీవ్రమైన అపఖ్యాతిని మూటగట్టుకున్న అమీర్ అన్ని అవరోధాలను అధిగమించి ‘నూతన సంవత్సర కానుక’ అందుకున్నట్లయంది. 2010లో ఇంగ్లాండ్ పర్యటన సందర్భంగా స్పాట్ ఫిక్సింగ్‌కు పాల్పడినందుకు జైలు శిక్షతో పాటు క్రికెట్ నుంచి నాలుగున్నర సంవత్సరాల పాటు నిషేధానికి గురైన అమీర్‌కు సహచర ఆటగాళ్ల అసమ్మతి సెగల మధ్య ఇటీవల జాతీయ శిక్షణా శిబిరంలో పాల్గొనే అవకాశం కల్పించడంతో పాక్ జట్టులో అతడికి మళ్లీ చోటు కల్పించడం ఖాయమని అందరూ అంచనా వేశారు.

ఈ అంచనాలను నిజం చేస్తూ పాక్ జాతీయ సెలెక్టర్లు ఇప్పుడు అమీర్‌ను న్యూజిలాండ్ పర్యటనకు ఎంపిక చేశారు. గత ఏడాది దేశవాళీ క్రికెట్‌లోకి పునరాగమనం చేసిన నాటి నుంచి అమీర్ ఎంతో కఠోరంగా శ్రమించాడని, పాకిస్తాన్ తరఫున రాణించాలని అతను దృఢ సంకల్పంతో ఉన్నందునే అంతర్జాతీయ వనే్డ, ట్వంటీ-20 సిరీస్‌లలో ఆడేందుకు న్యూజిలాండ్ వెళ్లబోతున్న పాక్ జట్లలో అతడికి మళ్లీ చోటు కల్పించామని చీఫ్ సెలెక్టర్ హరూన్ రషీద్ పిటిఐ వార్తా సంస్థకు తెలియజేశాడు. అయితే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అమీర్ పునరాగమనం అతడికి వీసా లభించడంపైన, న్యూజిలాండ్ అనుమతిపైన ఆధారపడి ఉంటుందని హరూన్ స్పష్టం చేశాడు. ప్రయాణ పత్రాల విషయంలో అమీర్‌కు ఏవైనా సమస్యలు తలెత్తితే అతను న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లలేడని, ఇదే జరిగితే ట్వంటీ-20 జట్టులో అమీర్ స్థానాన్ని మహ్మద్ ఇర్ఫాన్‌తో భర్తీ చేస్తామని హరూన్ తెలిపాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే పాక్ ట్వంటీ-20 జట్టులో వాస్తవానికి ఇర్ఫాన్‌కు చోటు కల్పించలేదని, ఇర్ఫాన్‌కు కొంత కాలం పాటు విశ్రాంతి ఇవ్వాలని భావించిన తాము అతడిని రిజర్వు ఆటగాడిగా అందుబాటులో ఉంచుకున్నామని హరూన్ చెప్పాడు.
ఇదీ గతం..
స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణం తెరమీదికి రావడానికి ముందు అమీర్ చివరి సారిగా 2010 ఆగస్టులో లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఆడాడు. అయితే బుకీల నుంచి ముడుపులు స్వీకరించి స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ముందే నిర్ధేశించుకున్న విధంగా ఉద్ధేశ్యపూర్వకంగా నోబాల్స్ వేసినందుకు ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత అమీర్‌తో పాటు పాక్ జట్టు కెప్టెన్ సల్మాన్ భట్, మహ్మద్ ఆసిఫ్‌లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసిసి) సస్పెండ్ చేసింది. అప్పటికి అంతర్జాతీయ క్రికెట్‌లో 14 టెస్టులు, 15 వనే్డలు, మరో 18 ట్వంటీ-20 మ్యాచ్‌లు ఆడిన అమీర్ వయసు కేవలం 18 సంవత్సరాలే. ఆ తర్వాత స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో దోషులుగా తేలిన ఈ ముగ్గురు ఆటగాళ్లపై ఐసిసికి చెందిన అవినీతి నిరోధక ట్రిబ్యునల్ ఐదేళ్ల పాటు నిషేధం విధించగా, ఆటలో అవినీతికి పాల్పడి బ్రిటన్‌ను మోసగించినందుకు ఈ ముగ్గురు కళంకితులు జైలు శిక్ష కూడా అనుభవించారు. వీరిపై విధించిన నిషేధం గత ఏడాది సెప్టెంబర్‌లో ముగియడంతో అవినీతి నిరోధక చట్టంలోని ప్రత్యేక క్లాజు ప్రకారం అమీర్‌కు 2015 ఆరంభంలో దేశవాళీ మ్యాచ్‌లు ఆడేందుకు ఐసిసి అనుమతి ఇచ్చింది.
టి-20 జట్టులో ఉమర్ గుల్‌కు స్థానం
ఇదిలావుంటే, ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లనున్న పాకిస్తాన్ ట్వంటీ-20 జట్టులో అనుభవజ్ఞుడైన పేస్ బౌలర్ ఉమర్ గుల్ (31)కు కూడా చోటు కల్పించినట్లు హరూన్ రషీద్ ప్రకటించాడు. ఫిట్నెస్ సమస్యలతో రెండేళ్ల క్రితం నుంచి జాతీయ జట్టుకు సరిగా అందుబాటులోలేని ఉమర్ గుల్ ప్రస్తుత సీజన్‌లో జరిగిన దేశవాళీ ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లలో చక్కగా రాణించి ఆకట్టుకున్నాడని హరూన్ చెప్పాడు. మోకాలి సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న ఉమర్ గుల్ గత ఏడాది ఏప్రిల్‌లో బంగ్లాదేశ్‌లో ట్వంటీ-20 మ్యాచ్ ఆడినప్పటికీ సరిగా రాణించలేక సెలెక్టర్ల విశ్వాసాన్ని కోల్పోయాడు. అయితే అన్ని సమస్యలను అధిగమించి మళ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో ఆడేందుకు ఉమర్ గుల్ సిద్ధంగా ఉన్నాడని తాము నిశ్చితాభిప్రాయానికి వచ్చినందు వల్లనే ట్వంటీ-20 జట్టులో అతనికి చోటు కల్పించామని హరూన్ తెలిపాడు. ఎంతో అనుభవజ్ఞుడైన ఉమర్ గుల్ ఇప్పటివరకూ అంతర్జాతీయ టెస్టుల్లో 163, వనే్డల్లో 173, ట్వంటీ-20 మ్యాచ్‌లలో 83 వికెట్లు సాధించాడు. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లే పాక్ ట్వంటీ-20 జట్టులో ఉపయుక్తమైన ఆటగాళ్లకే ప్రాధాన్యత ఇచ్చామని హరూన్ రషీద్ చెప్పాడు.

న్యూజిలాండ్ వెళ్లే
పాక్ జట్లు ఇవీ

ట్వంటీ-20 జట్టు: షహీద్ అఫ్రిదీ (కెప్టెన్), మహ్మద్ హఫీజ్, అహ్మద్ షెహజాద్, షోయబ్ మక్సూద్, ఉమర్ అక్మల్, సాద్ నసీం, షోయబ్ మాలిక్, ఇఫ్తికార్ అహ్మద్, మహ్మద్ రిజ్వాన్, సర్‌ఫ్రాజ్ అహ్మద్, అన్వర్ అలీ, అమీర్ యమీన్, ఇమద్ వాసిం, వహాబ్ రియాజ్, మహ్మద్ అమీర్, ఉమర్ గుల్.
రిజర్వు ఆటగాడు: మహ్మద్ ఇర్ఫాన్.
వనే్డ జట్టు: అజర్ అలీ (కెప్టెన్), మహ్మద్ హఫీజ్, అహ్మద్ షెహజాద్, షోయబ్ మక్సూద్, షోయబ్ మాలిక్, అసద్ షఫిక్, బాబర్ ఆజం, జఫర్ గోహర్, ఇమద్ వాసిం, అన్వర్ అలీ, సర్‌ఫ్రాజ్ అహ్మద్, వహాబ్ రియాజ్, రహత్ అలీ, మహ్మద్ ఇర్ఫాన్, మహ్మద్ రిజ్వాన్, మహ్మద్ అమీర్.

స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో సహచర దోషులు భట్, ఆసిఫ్‌లతో అమీర్ (ఫైల్ ఫొటో)