క్రీడాభూమి

పిబిఎల్‌కు బ్రహ్మరథం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 3: ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)కు అభిమానులు బ్రహ్మరథం పడతారని నిర్వాహకులు ఆశిస్తున్నారు. బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ నృత్య ప్రదర్శనతో ఒర్లీలోని సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ స్టేడియంలో శనివారం రాత్రి ఆరంభమైన పిబిఎల్‌కు ప్రేక్షకాదరణ విపరీతంగా ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇండియన్ బాడ్మింటన్ లీగ్ (ఐబిఎల్)గా మొదలైన ఈ టోర్నీ పేరును ఇటీవలే ప్రీమియర్ బాడ్మింటన్ లీగ్ (పిబిఎల్)గా మార్చారు. భారత బాడ్మింటన్ సమాఖ్య (బాయ్) ఆధ్వర్యంలో మొదలైన ఈ టోర్నీ 17వ తేదీ వరకూ జరుగుతుంది. ఇది త్వరలోనే ప్రపంచంలోనే మేటి బాడ్మింటన్ టోర్నీగా ఎదుగుతుందని బాయ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నది. 2013లో పిబిఎల్ తొలి టోర్నీ జరిగింది. ఆతర్వాత రెండేళ్లు సరైన స్పాన్సర్లు లభించక పోవడంతో టోర్నీకి బ్రేక్ పడింది. ఇప్పుడు స్పోర్ట్‌లైవ్ నుంచి స్పాన్సర్‌షిప్ అందడంతో అట్టహాసంగా మొదలైంది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు, గాయకులు సలీమ్, సలేమాన్ తమ పాటలతో అలరించారు. అయితే, టోర్నీ బ్రాండ్ అంబాసిడర్ అక్షయ్ కుమార్ హాజరుకాకపోవడం అభిమానులను నిరాశకు గురి చేసింది.
శ్రీకాంత్ శ్రమ వృథా
ప్రపంచ నంబర్ వన్ లీ చాంగ్ వెయ్‌పై కిడాంబి శ్రీకాంత్ 15-12, 6-15, 15-7 తేడాతో సంచలన విజయాన్ని సాధించాడు. కానీ, అతని శ్రమ వృథాకాగా, ఆదివారం హైదరాబాద్ హంటర్స్‌తో జరిగిన పోరులో బెంగళూరు హాట్ గన్స్ 2-3 తేడాతో పరాజయాన్ని ఎదుర్కొంది. హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న మరో స్టార్ ఆటగాడు పారుపల్లి కశ్యప్ 15-14, 15-13 ఆధిక్యంతో సమీర్ వర్మను ఓడించాడు. కాగా, ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు చాంగ్ వెయ్‌పై గెలచిన శ్రీకాంత్ తన ఫా మ్‌ను నిరూపించుకున్నాడు.