క్రీడాభూమి

విజయమే టీమిండియా లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ లూయిస్, ఆగస్టు 8: వెస్టిండీస్‌తో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న మూడో క్రికెట్ టెస్టులో విజయమే లక్ష్యంగా టీమిండియా బరిలోకి దిగనుంది. మొదటి టెస్టును గెల్చుకున్న భారత్, రెండో టెస్టులో దాదాపుగా చేతికి అందిన విజయాన్ని చేజార్చుకుంది. బౌలింగ్ విభాగం విఫలం కావడంతో ఆ మ్యాచ్‌ని డ్రాగా ముగించింది. రోస్టన్ చేజ్ 269 బంతుల్లో అజయంగా 137 పరుగులు సాధించడంతో, భారత బౌలింగ్‌లో డొల్లతనం మరోసారి బహిర్గతమైంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని, మూడో టెస్టులో కొన్ని ప్రయోగాలకు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సిద్ధమయ్యే అవకాశాలున్నాయి. ఈ మ్యాచ్ కోసం టీమిండియా ముమ్మరంగా ప్రాక్టీస్ చేసింది. ఎదురుదాడికి విండీస్ కూడా సంసిద్ధం కాడవంతో మూడో టెస్టు కూడా ఆసక్తికరంగా సాగే అవకాశాలున్నాయి.