క్రీడాభూమి

ప్రయోగాల అవసరం అశ్విన్‌కు లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 3: భారత సీనియర్ స్పిన్నర్ అశ్విన్ అత్యుత్తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడని, అతను కొత్తగా ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదని మాజీ స్పిన్నర్ వెంకటపతి రాజు అభిప్రాయపడ్డాడు. పిటిఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను మాట్లాడుతూ అశ్విన్‌ను స్ట్రయిక్ బౌలర్‌గా, మ్యాచ్ విన్నర్‌గా అభివర్ణించాడు. బౌలింగ్‌లో ఎన్నో వైవిధ్యాలను ప్రదర్శించగల సత్తా అతనికి ఉందని కితాబునిచ్చాడు. ప్రయోగాలు సఫలం కాకపోతే, చాలా త్వరగా తనదైన శైలిలో బౌలింగ్ చేయడం అతని అలవాటని పేర్కొన్నాడు. ఈ లక్షణమే అశ్విన్‌ను ఉత్తమ బౌలర్‌గా నిలబెట్టిందని చెప్పాడు.