క్రీడాభూమి

క్వార్టర్స్‌కు దాస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్‌లో భారత ఆర్చర్ అతాను దాస్ అద్భుత ప్రదర్శనతో ముందుకు కొనసాగుతున్నాడు. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల వ్యక్తిగత ఎలిమినేషన్ రౌండ్‌లో అతను వరుస సెట్ల తేడాతో నేపాల్‌కు చెందిన ముక్తాన్ జీత్‌బహదూర్‌ను మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లాడు. ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన దాస్ 29-26, 29-24, 30-26 సెట్ల తేడాతో జీత్‌బహదూర్‌ను చిత్తు చేశాడు. ఈ పోటీలో దాస్ ఏడుసార్లు పదికి పది పాయింట్లు సాధించి సత్తా చాటుకోగా, జీత్‌బహదూర్ కేవలం రెండుసార్లు మాత్రమే ఆ ఫీట్‌ను అందుకున్నాడు. దీంతో మొత్తం మీద 88-76 పాయింట్ల తేడాతో జీత్‌బహదూర్‌ను ఓడించిన దాస్ సెమీఫైనల్స్‌లో స్థానం కోసం మంగళవారం రాత్రే తదుపరి మ్యాచ్ ఆడనున్నాడు. తొలిసారి ఒలింపిక్ బరిలోకి దిగిన అతాను దాస్ క్వాలిఫికేషన్ రౌండ్‌లో పేలవమైన ప్రదర్శనతో ఐదో స్థానంలో నిలిచినప్పటికీ ఆ తర్వాత అనూహ్య రీతిలో పుంజుకుని చక్కటి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంటం విశేషం. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పురుషుల ఆర్చరీ జట్టు ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంలో విఫలమవడంతో భారత్ నుంచి దాస్ ఒక్కడే బరిలోకి దిగి వ్యక్తిత విభాగంలో పోరాడుతున్నాడు.
భొకనాల్ ఆశలు ఆవిరి
స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో
నాలుగో స్థానానికి పరిమితం
రియో డి జెనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్‌లో మెడల్ రౌండ్‌కు చేరుకోవాలన్న భారత రోయర్ దత్తు బబాన్ భొకనాల్ ఆశలు నీరుగారి పోయాయి. మంగళవారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ స్కల్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో స్థానానికి పరిమితమవడమే ఇందుకు కారణం. 2000 మీటర్ల లక్ష్యాన్ని భొకనాల్ 6:59:89 నిమిషాల వ్యవధిలో అధిగమించాడు. ఈ పోటీలో తృతీయ స్థానంలో నిలిచిన పోలెండ్ రోయర్ నతన్ వెగ్రిస్కీ (6:49:41) కంటే ఇది ఆరు సెకన్లకు పైగా ఎక్కువ. లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న క్రొయేషియా రోయర్ దమిర్ మార్టిన్ 6:44:44 నిమిషాల వ్యవధిలో లక్ష్యాన్ని అధిగమించి క్వార్టర్ ఫైనల్‌లో విజేతగా నిలువగా, ద్వితీయ స్థానంలో నిలిచిన అలన్ క్యాంప్‌బెల్ 6:49:41 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకున్నాడు.