క్రీడాభూమి

భారత్‌తో టి-20 సిరీస్‌కు విండీస్ సారథిగా బ్రాత్‌వైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సెయింట్ జాన్స్ (ఆంటిగ్వా అండ్ బార్బుడా), ఆగస్టు 9: ప్రపంచ కప్ టి-20 క్రికెట్ టోర్నమెంట్‌లో వెస్టిండీస్ జట్టు టైటిల్‌ను గెలుచుకోవడంలో ముఖ్యపాత్ర పోషించిన కార్లోస్ బ్రాత్‌వైట్‌ను అదృష్టం వరించింది. అమెరికాలో ఈ నెలాఖరున టీమిండియాతో రెండు మ్యాచ్‌ల ట్వంటీ-20 సిరీస్‌లో తలపడనున్న వెస్టిండీస్ జట్టుకు బ్రాత్‌వైట్‌ను కెప్టెన్‌గా నియమించారు. ఆరేళ్ల నుంచి కెప్టెన్‌గా కొనసాగుతున్న డారెన్ సమీపై విండీస్ సెలెక్టర్లు శుక్రవారం వేటు వేయడంతో అతని స్థానంలో బ్రాత్‌వైట్ కొత్త సారథిగా ఈ బాధ్యతలు చేపట్టనున్నాడు. కరీబియన్ దీవుల్లో ప్రస్తుతం కొనసాగుతున్న నాలుగు టెస్టుల సిరీస్ ముగిసిన తర్వాత భారత్, వెస్టిండీస్ జట్లు ఈ నెల 27, 28 తేదీల్లో ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌లో రెండు మ్యాచ్‌ల టి-20 సిరీస్‌లో తలపడతాయి. ఈ ఏడాది ఆరంభంలో ముంబయిలో ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచ కప్ టి-20 టోర్నీ ఫైనల్ మ్యాచ్ చివరి ఓవర్‌లో ఆరు సిక్సర్లు విండీస్‌కు టైటిల్‌ను అందించిన బ్రాత్‌వైట్ ఉన్నట్టుండి ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన విషయం విదితమే. టి-20 ఫార్మాట్‌లో బ్రాత్‌వైట్ ఎంతో ప్రతిభావంతుడైన ఆటగాడని, ఆట పట్ల అతనికి గల నిబద్ధత యువ ఆటగాళ్లకు స్ఫూర్తినిస్తుందని వెస్టిండీస్ సెలెక్షన్ కమిటీ చైర్మన్ కోట్నీ బ్రౌన్ చెప్పాడు.
విండీస్ టి-20 జట్టు ఇదే
కార్లోస్ బ్రాత్‌వైట్ (కెప్టెన్), ఆండ్రూ ఫ్లెచర్, ఆండ్రూ రసెల్, క్రిస్ గేల్, డ్వెయిన్ బ్రావో, ఎవిన్ లూయిస్, జాసన్ హోల్డర్, జాన్సన్ చార్లెస్, కీరన్ పొలార్డ్, లెండిల్ సిమ్మన్స్, మర్లాన్ శామ్యూల్స్, శామ్యూల్ బద్రి, సునీల్ నరైన్.