క్రీడాభూమి

విడిపోయిన సానియా-సింగిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: గత ఏడాది వరస విజయాలతో మహిళా టెన్నిస్‌లో సంచనాలు సృష్టించిన సానియా మీర్జా- హింగిస్ జోడీ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరూ కలిసి గత ఏడాది మొత్తం 9 టైటిళ్లను గెలుచుకుని నంబర్ వన్ స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. అయితే గత అయిదు నెలలుగా ఈ జోడీ ఆశించిన రీతిలో రాణించలేక పోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సానియా సన్నిహిత వర్గాలు తెలిశాయి. సానియా ఇకపై చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రపంచ 21వ నంబర్ క్రీడాకారిణి బర్బరా స్ట్రికోవాతో కలిసి ఆడనుండగా, హింగిస్ అమెరికాకు చెందిన కొకో వాండెవెఘెతో కలిసి ఆడుతుంది.