క్రీడాభూమి

ఉత్కంఠ పోరులో గట్టెక్కిన భారత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 9: రియో ఒలింపిక్స్ పురుషుల హాకీలో భారత జట్టు పెద్ద గండం నుంచి గట్టెక్కి క్వార్టర్ ఫైనల్స్‌కు చేరుకునే అవకాశాలను మెరుగుపర్చుకుంది. మంగళవారం ఇక్కడ ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో భారత జట్టు 2-1 తేడాతో అర్జెంటీనా జట్టుపై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో 45 నిమిషాల పాటు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించిన భారత జట్టుకు 8వ నిమిషంలో చిన్‌గ్లెన్సన సింగ్ తొలి గోల్‌ను అందించగా, 35వ నిమిషంలో మణిపూర్ ఆటగాడు కొథాజిత్ సింగ్ అద్భుతమైన ఫీల్డ్ గోల్‌ను సాధించి పెట్టాడు. దీంతో 2-0 తేడాతో వెనుకబడిన అర్జెంటీనా జట్టు చివరి 15 నిమిషాల్లో తీవ్రస్థాయిలో పోరాడింది. దీంతో తీవ్రమైన వత్తిడికి లోనైన భారత జట్టు ప్రత్యర్థులకు ఏకంగా ఐదు పెనాల్టీ కార్నర్లను సమర్పించుకుంది. 49వ నిమిషంలో తొలి పెనాల్టీ కార్నర్‌ను అర్జెంటీనా డ్రాగ్‌ఫ్లికర్ గొంజాలో పిల్లట్ అద్భుతమైన షాట్‌గా మలచడంతో బంతి భారత గోల్‌కీపర్ పిఆర్.శ్రీజేష్‌కు తగిలి గోల్‌గా మారింది. దీంతో భారత శిబిరంలో నరాలు తెగే ఉత్కంఠ నెలకొంది. అయితే ఆ తర్వాత మిగిలిన పెనాల్టీ కార్నర్లను శ్రీజేష్ సమర్థవంతంగా ప్రతిఘటించి అర్జెంటీనా ఆశలపై నీళ్లు చల్లాడు. దీంతో భారత జట్టు 2-1 గోల్స్ తేడాతో విజయం సాధించింది.
2009లో జరిగిన చాంపియన్స్ చాలెంజ్ టోర్నీలో అర్జెటీనా చేతిలో 3-2 గోల్స్ తేడాతో ఓటమిపాలైన భారత జట్టుకు ఇది ఎంతో ప్రాధాన్యతతో కూడిన విజయం. రియో ఒలింపిక్స్‌కు ముందు ఇటీవల వాలెన్సియాలో ఈ రెండు జట్లు ఆరు దేశాల టోర్నీలో తలపడినప్పటికీ ఆ మ్యాచ్ డ్రాగా ముగియడమే ఇందుకు కారణం. అయితే తాజాగా ఒలింపిక్స్‌లో అర్జెంటీనాను ఓడించి ప్రతీకారం తీర్చుకున్న భారత జట్టు పూల్ దశలో రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. దీంతో ఇప్పటివరకూ 6 పాయింట్లు సాధించి రెండో స్థానానికి ఎగబాకిన భారత జట్టుకు క్వార్టర్ ఫైనల్ బెర్తు దాదాపు ఖాయమైంది. పూల్-బిలో భారత జట్టు లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న నెదర్లాండ్స్ జట్టుతో తలపడనుంది.