క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు బొంబాల్యాదేవి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 10: భారత మహిళా ఆర్చర్ లైష్రామ్ బొంబాల్యా దేవి పతకాలపై ఆశలు పెంచింది. మహిళల ఇండివిజువల్ రికర్వ్ ఎలిమినేషన్స్‌లో చక్కటి ప్రతిభ కనబరచి ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. గ్రూప్ ఆఫ్ 64లో ఆస్ట్రేలియాకు చెందిన లారెన్స్ బల్డ్ఫోను 6-2 పాయింట్ల తేడాతో చిత్తుచేసిన ఆమె ఆతర్వాత చైనీస్ తైపీ ఆర్చర్ లిన్ షిన్ చియాను కూడా అదే ఆధిక్యంతో ఓడించి ప్రీ క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. ఇదే విభాగంలో గ్రూప్ ఆఫ్ 64లో పోటీపడిన మరో భారత ఆర్చర్ లక్ష్మీరాణి మజీ దారుణంగా విఫలమైంది. స్లొవేకియాకు చెందిన అలెక్సాండ్రా లంగోవా 7-1 పాయింట్ల తేడాతో లక్ష్మీరాణిని ఓడించింది. కాగా, గురువారం తెల్లవారు జామున మూడు గంటలకు మొదలయ్యే గ్రూప్ ఆఫ్ 32లో జార్జియాకు చెందిన క్రిస్టినే ఎసెబువాతో తలపడుతుంది.
జితూ, శివలింగం అవుట్
షూటింగ్, వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్‌కు బుధవారం చుక్కెదురైంది. ఈసారి ఒలింపిక్స్‌లో తప్పక పతకాన్ని సాధిస్తాడనుకున్న జీతూ రాయ్ పోరాటం ముగిసింది. పురుషుల 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్‌లో పోటీపడిన అతను 554 పాయింట్లతో 12వ స్థానానికి పరిమితమయ్యాడు. ఫైనల్స్ కూడా క్వాలిఫై కాలేక నిష్క్రమించాడు. ఇదే విభాగంలో పోటీపడిన మరో భారత షూటర్ ప్రకాష్ నంజప్ప దారుణంగా విఫలమై, 547 పాయింట్లతో 25వ స్థానంలో నిలిచాడు. పురుషుల 77 కిలోల వెయిట్‌లిఫ్టింగ్‌లో సతీష్ శివలింగం చివరి వరకూ శ్రమించాడు. అయితే, గ్రూప్ ‘బి’లో అతను 329 కిలోల బరువునెత్తి, నాలుగో స్థానంలో నిలవడంతో ఫైనల్స్‌కు అర్హత సంపాదించలేకపోయాడు. గ్రూప్ ‘ఎ’, గ్రూప్ ‘బి’లలో మొదటి మూడు స్థానాలను ఆక్రమించిన లిఫ్టర్లకు ఫైనల్‌లో స్థానం దక్కుతుంది. శివలింగం ఎంత శ్రమించినా ఫైనల్ వరకూ వెళ్లలేకపోయాడు.
అవతార్ సింగ్ చిత్తు
రియో డి జెనీరో: భారత జూడోకాన్ అవతార్ సింగ్ పురుషుల 90 కిలోల విభాగంలో చిత్తయ్యాడు. ఒలింపిక్స్‌లో మొదటిసారి బరిలోకి దిగిన శరణార్థుల బృందంలోని పొపొల్ మిసెంగాతో జరిగిన పోరులో అతను ఏమాత్రం రాణించలేకపోయాడు. కనీస ప్రతిఘటన కూడా లేకుండానే చేతులెత్తేశాడు. జూడోలో మన దేశం నుంచి ఒలింపిక్స్‌కు క్వాలిఫై అయిన ఏకైక జూడోకాన్ అవతార్ సింగ్ ఓటమితో అభిమానులు నిరాశ చెందారు.