క్రీడాభూమి

మా క్రికెటర్లలో పోరాటతత్వం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 3: వెస్టిండీస్ క్రికెటర్లలో పోరాట పటిమ కొరవడిందని, వారు ఏ దశలోనూ ప్రత్యర్థి జట్లకు గట్టిపోటీని ఇవ్వలేకపోతున్నారని మాజీ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ విమర్శించాడు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డు (డబ్ల్యుఐసిబి)తో విభేదాలను, కాంట్రాక్టు విషయంలో తమ డిమాండ్లను పదేపదే కారణగా చూపిస్తూ తమతమ బాధ్యతల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారని ఆదివారం ఇక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న రాబర్ట్స్ అన్నాడు. 2014లో విండీస్ క్రికెటర్లు భారత పూర్యటనను పూర్తి చేయకుండా, అర్ధాంతరంగానే ముగించుకొని వెళ్లిపోయిన విషయాన్ని అతను గుర్తుచేశాడు. ఈ సంఘటనలో డబ్ల్యుఐసిబి పొరపాటు లేదని చెప్పడానికి వీల్లేదన్నాడు. అయితే, బోర్డునే దోషిగా నిర్ధారించలేమని స్పష్టం చేశాడు. డిమాండ్లను మైదానం వెలుపల చూసుకోవాలని, ఒకసారి మైదానంలోకి దిగిన తర్వాత సాధ్యమైనంత వరకూ గట్టిపోటీని ఇవ్వడానికి కృషి చేయాలని అన్నాడు. బోర్డు, క్రికెటర్ల మధ్య తలెత్తిన విభేదాలను పరిష్కరించడానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసిసి) ప్రయత్నించి ఉంటే బాగుండేదని అన్నాడు. ఆ దిశగా ప్రయత్నం జరగకపోవడం వల్లే విండీస్ క్రికెట్‌లో ప్రమాణాలు దారుణంగా పడిపోయాయని చెప్పాడు. ఆటగాళ్లు ఇకనైనా కారణాలు వెతుక్కోవడం మానేసి ఆటపై దృష్టి కేంద్రీకరించాలని హితవు పలికాడు. మొదటి ప్రాధాన్యం క్రికెట్‌కు ఇవ్వాలని, ఎంత కష్టపడి పోరాడితే అంత గొప్ప ఫలితాలు లభిస్తాయని అన్నాడు. విండీస్ జట్టులో సమర్థులు ఉన్నప్పటికీ, వారిలో పోరాటతత్వం లేకపోవడం బాధిస్తున్నదని చెప్పాడు.