క్రీడాభూమి

సైనాపైనే ఆశ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: రియో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ఫ్లాప్ షో కొనసాగుతున్న నేపథ్యంలో, గురువారం నుంచి మొదలయ్యే బాడ్మింటన్‌పై అందరు దృష్టి కేంద్రీకరించారు. మహిళల సింగిల్స్‌లో పోటీపడుతున్న హైదరాబాదీ సైనా నెహ్వాల్‌పైనే అభిమానులు ఆశపెట్టుకున్నారు. తెలుగు తేజం పివి సింధు కూడా బరిలోకి దిగనుంది. అయితే, లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్న సైనా ఈసారి అంతకంటే మెరుగైన ప్రదర్శనతో రాణిస్తుందని అభిమానులు నమ్ముతున్నారు.
మహిళల హాకీలో మరో ఓటమి
రియో డి జెనీరో: మహిళల హాకీలో భారత జట్టు మరోసారి పరాజయాన్ని చవి చూసింది. ఆస్ట్రేలియాను ఢీకొన్న ఈ జట్టు ఏకంగా 1-6 తేడాతో చిత్తయింది. ఆసీస్ క్రీడాకారిణులు ఐదు గోల్స్ చేస్తే, సునీత ఓన్ గోల్‌తో ఆ జట్టుకు మరో గోల్ అదనంగా లభించింది. భారత్‌కు అనూరాధా దేవి కంటి తుడుపు గోల్‌ను అందించింది.