క్రీడాభూమి

పాక్ క్రికెట్ కురువృద్ధుడు హనీఫ్ మహమ్మద్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరాచీ, ఆగస్టు 11: పాకిస్తాన్ క్రికెట్ కురువృద్ధుడు హనీఫ్ మహమ్మద్ కన్నుమూశాడు. కొంతకాలంగా కేన్సర్ వ్యాధితో బాధపడుతున్న అతను తన 81వ ఏట కన్నుమూశాడని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) గురువారం విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపింది. తొలుత హనీఫ్ మృతి చెందాడని వార్త వెలువడింది. ఆ వెంటనే అతని గుండె మళ్లీ కొట్టుకోవడం ఆరంభించిందని, కోలుకునే అవకాశాలున్నాయని పాక్ మీడియా పేర్కొంది. కానీ, హనీఫ్ మృతిని అతని కుమారుడు, మాజీ క్రికెటర్ షోయబ్ మహమ్మద్ ధ్రువీకరించాడు. 2013లో హనీఫ్‌కు ఊపిరితిత్తుల కేన్సర్ సోకినట్టు తెలిసింది. అప్పటి నుంచి అతను మృత్యువుతో పోరాడుతునే ఉన్నాడు. మూడేళ్లు కేన్సర్‌తో బాధపడిన అతను గురువారం మృతి చెందాడని, ఆయన లేని లోటును భర్తీ చేయడం సాధ్యం కాదని షోయబ్ వ్యాఖ్యానించాడు. కెరీర్‌లో 55 టెస్టులు ఆడిన హనీఫ్ 43.98 సగటుతో 3,915 పరుగులు సాధించాడు. అతని స్కోరులో 12 శతకాలు ఉన్నాయి. 238 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో అతను 17,059 పరుగులు చేశాడు. 1958లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో అతను 337 పరుగులు చేసి, పాక్ తరఫున ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలో అతను 970 నిమిషాలు క్రీజ్‌లో నిలిచాడు. టెస్టు క్రికెట్‌లో ఇప్పటి వరకూ అదే అత్యంత సుదీర్ఘమైన ఇన్నింగ్స్.