క్రీడాభూమి

స్టార్ అట్రాక్షన్ బోల్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 11: రియో ఒలింపిక్స్ కీలక దశకు చేరుకున్నాయి. ఈ మెగా పోటీలకు ప్రాణమైన అథ్లెటిక్స్ విభాగంలో పోటీలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. వరుసగా రెండుసార్లు 100, 200 మీటర్ల పరుగుతోపాటు 400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకాలను కైవసం చేసుకున్న ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ ‘ట్రిపుల్ ట్రిపుల్’ను సాధించేందుకు బరిలోకి దిగుతున్నాడు. ఈత కొలనులో అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ ప్రకంపనలు సృస్తుంటే, ట్రాక్‌పై బోల్ట్ స్టార్ అట్రాక్షన్‌గా నిలుస్తున్నాడు. అతను ముచ్చటగా మూడోసారి ‘ట్రిపుల్’ను అందుకుంటాడా? లేదా? అని ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అతని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. డోప్ పరీక్షల్లో దోషులుగా తేలుతున్న వారు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిష్ఠ కోల్పోతున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఎఎఎఫ్)కు బోల్ట్ రూపంలో ఆశాకిరణం కనిపిస్తున్నది. క్రీడాస్ఫూర్తికి, సామర్థ్యానికి బోల్ట్‌ను నిలువెత్తు రూపంగా చూపించి, అతనిని ఆదర్శంగా తీసుకొని క్రీడల్లో రాణించాలని ప్రపంచానికి సందేశం ఇవ్వనుంది. 2008 బీజింగ్, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మూడేసి స్వర్ణాలను గెల్చుకున్న బోల్ట్ మరోసారి అదే స్థాయిలో రాణిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మొత్తం మీద అథ్లెటిక్స్‌లో 141 స్వర్ణాలకు పోటీలు జరగనుండా, గురువారం మొదటి 47 స్వర్ణాలు ఖాయమవుతాయి. మహిళల 10,000 మీటర్ల పరుగులో ఇథియోపియాకు చెందిన డిఫెండింగ్ చాంపియన్ టిరునేష్ డిబాబా తన టైటిల్‌ను నిలబెట్టుకోవడానికి బరిలోకి దిగనుంది. శనివారం జమైకా మహిళా అత్లెట్ షెల్లీ ఆన్ ఫ్రేజర్ ప్రైస్ 100 మీటర్ల పరుగులతో విజేతగా నిలిచేందుకు పోటీపడుతుంది. ఆమెకు ఎలైన్ థాంప్సన్, డఫ్నే చిపెర్స్ తదితరుల నుంచి గట్టిపోటీ తప్పకపోవచ్చు. పురుషుల 10,000 మీటర్ల పరుగులో మో ఫరా డిఫెండింగ్ చాంపియన్‌గా పోటీలో ఉంటాడు.

చిత్రం.. ఉసేన్ బోల్ట్