క్రీడాభూమి

అదే జోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 12: రియో ఒలింపిక్స్‌లో అమెరికా సూపర్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్ జోరు కొనసాగుతున్నది. స్విమ్మింగ్ పూల్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తున్న ఫెల్ప్స్ రియో ఒలింపిక్స్‌లో నాలుగవ, మొత్తం మీద 22వ ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని అందుకున్నాడు. తన సహచరుడు, చిరకాల ప్రత్యర్థి ర్యాన్ లోచెను మరోసారి చిత్తుచేసి, పురుషుల 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లే టైటిల్‌ను సాధించాడు. అతను లక్ష్యాన్ని ఒక నిమిషం 54.66 సెకన్లలో చేరడం విశేషం. జపాన్ స్విమ్మర్ కొసుకె హగినో ఒక నిమిషం 56.61 సెకన్లతో రజత పతకాన్ని అందుకోగా, వాంగ్ షున్ (చైనా) ఒక నిమిషం 57.05 సెకన్లలో గమ్యాన్ని చేరుకొని కాంస్య పతకాన్ని గెల్చుకున్నాడు. నాలుగేళ్ల క్రితం, లండన్ ఒలింపిక్స్ ముగిసిన వెంటనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఫెల్ప్స్ మనసు మార్చుకొని మళ్లీ అంతర్జాతీయ బరిలోకి దిగినప్పుడు అతను పూర్వ వైభవాన్ని కొనసాగించడం దాదాపు అసాధ్యమన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ, తన అద్వితీయ ప్రతిభతో అతను విమర్శకుల నోళ్లు మూయించాడు. రియో ఒలింపిక్స్‌లో ఇప్పటి వరకూ పోటీపడిన నాలుగు విభాగాల్లోనూ అతను స్వర్ణాలను కైవసం చేసుకొని తనంటే ఏమిటో రుజువు చేసుకున్నాడు. 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో విజేతగా నిలవడం ద్వారా అతను కెరీర్‌లో 19వ ఒలింపిక్ పతకాన్ని స్వీకరించిన విషయం తెలిసిందే. అదే ఊపును కొనసాగిస్తూ, 4న100 మీటర్ల ఫ్రీస్టయిల్, 4న200 మీటర్ల ఫ్రీస్టయిల్ ఈవెంట్స్‌లోనూ స్వర్ణ పతకాలను సాధించాడు. తాజాగా 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లేలోనూ స్వర్ణాన్ని దక్కించుకున్నాడు. ఈ పతకంతో ఒలింపిక్స్‌లో అతని స్వర్ణ పతకాల సంఖ్య ఇప్పుడు 22కు చేరింది. మొత్తం మీద అతనికి ఇది 26వ ఒలింపిక్ పతకం. ప్రస్తుతం అతని ఖాతాలో 22 స్వర్ణాలు, రెండు రజతాలు, మరో రెండు కాంస్యాలున్నాయ.
ఆరంభంలోనే సంచలనం
ఫెల్ప్స్ రియో ఒలింపిక్స్‌లో బరిలోకి దిగడమే సంచలనం సృష్టించింది. మద్యం తాగి డ్రైవింగ్ చేసి పట్టుబడి జైలు శిక్షను ఎదుర్కోవడం, చాలాకాలం అంతర్జాతీయ పోటీలకు దూరంగా ఉండడం వంటి అంశాలు అతని ఫామ్‌పై అనుమానాలను రేకెత్తించాయి. అందుకే అతను క్వాలిఫయర్స్‌ను సమర్థంగా పూర్తి చేయలేడని, ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించడం కష్టమని చాలా మంది వాదించారు. వారి ఆలోచన తప్పని నిరూపిస్తూ ఫెల్ప్స్ యుఎస్ క్వాలిఫయర్స్‌ను సులభంగానే పూర్తి చేశాడు. రియోలో అతను మొదట 200 మీటర్ల బటర్‌ఫ్లై ఈవెంట్‌లో బరిలోకి దిగి, ఒక నిమషం 53.36 సెకన్లలో లక్ష్యాన్ని చేరడం ద్వారా స్వర్ణ పతకాన్ని సాధించాడు. అనంతరం 4న100మీటర్ల ఫ్రీస్టయిల్ రీలో సిలెబ్ డ్రెసెల్, ర్యాన్ హెల్డ్, నాథన్ ఆడ్రియన్‌తో కలిసి పోటీపడిన ఫెల్ప్ అదే స్థాయిలో రాణించాడు. వీరు లక్ష్యాన్ని 3 నిమిషాల 09.92 సెకన్లలో చేరుకొని స్వర్ణ పతకాన్ని అందుకుంది. ఫెల్ప్స్‌కు రియోలో మూడో స్వర్ణం 4200 మీటర్ల ఫ్రీస్టయిల్ విభాగంలో లభించింది. ర్యాన్ లొచే, టౌనే్ల హాస్, కానర్ డ్వయర్‌లతో కలిసి ఫెల్ప్స్ పోటీపడ్డాడు. ఈ జట్టు లక్ష్యాన్ని 7 నిమిషాల 0.66 సెకన్లలో గమ్యాన్ని చేరింది. నాలుగో స్వర్ణం కోసం 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లేలో పోటీపడిన 31 ఏళ్ల ఫెల్ప్స్ యువ స్విమ్మర్ల నుంచి ఎదురైన పోటీని తట్టుకొని విజేతగా నిలిచాడు. రియోలో ఇంకా అతను మరో రెండు ఈవెంట్స్‌లో పాల్గొంటాడు. పురుషుల 100 మీటర్ల బటర్‌ఫ్లైతోపాటు, 4న100 మీటర్ల మెడ్లేలోనూ అతను సత్తా నిరూపించుకోనున్నాడు. ఇదే రోజును కొనసాగిస్తే ఫెల్ప్స్ మరో రెండు స్వర్ణ పతకాలను సాధించడం ఖాయం. ఫెల్ప్స్ రికార్డును అందుకోవడం ఇప్పట్లో ఎవరికీ సాధ్యం కాదనడం నిజం.

రియోలో పురుషుల 200 మీటర్ల ఇండివిజువల్ మెడ్లేలో సువర్ణ పతకాన్ని కైవసం చేసుకున్న అమెరికా స్టార్ స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్. ఈ ఒలింపిక్స్‌లో అతనికి ఇది నాలుగవ, మొత్తం మీద 22వ స్వర్ణ పతకం. ఒలింపిక్స్ సహా అంతర్జాతీయ ఈవెంట్స్‌లో ఫెల్ప్స్ ఇంత వరకూ సాధించిన పతకాల సంఖ్య 80కి చేరింది. వీటిలో 65 స్వర్ణాలుకాగా, 13 రజతాలు, మూడు కాంస్యాలు ఉన్నాయి. ఈత కొలనులో తిరుగులేని ఈ వీరుడు మరో రెండు విభాగాల్లో పోటీపడనున్నాడు.