క్రీడాభూమి

విండీస్ 6 వికెట్లకు 207

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిడ్నీ, జనవరి 3: ఆస్ట్రేలియాతో ఆదివారం ప్రారంభమైన మూడో టెస్టు మ్యాచ్ మొదటి రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లకు 207 పరుగులు చేసింది. క్రెగ్ బ్రాత్‌వెయిట్ 85 పరుగులతో ఆదుకోకపోతే, విండీస్‌కు ఈ స్కోరు కూడా సాధ్యమయ్యేది కాదు. ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ రెండు వికెట్లు పడగొట్టడమేగాక, విండీస్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విండీస్ కేవలం 13 పరుగుల వద్ద షాయ్ హోప్ (9) వికెట్‌ను కోల్పోయింది. జొస్ హాజెల్‌వుడ్ బౌలింగ్‌లో వికెట్‌కీపర్ పీటర్ నెవిల్ క్యాచ్ అందుకోగా హోప్ వెనుదిరిగాడు. ఈ సిరీస్‌లో విండీస్ బ్యాటింగ్‌కు వెన్నుముకగా నిలిచిన డారెన్ బ్రేవో కొంత సేపు ఆసీస్ బౌలింగ్‌ను ప్రతిఘటించాడు. అయితే, 33 పరుగుల వ్యక్తిగత స్కోరువద్ద లియాన్ ఎక్‌స్ట్రా బౌన్స్‌తో వేసిన బంతిని అర్ధం చేసుకోలేక, ఉస్మాన్ ఖాజాకు దొరికిపోయాడు. ఈ వికెట్‌తో లియాన్ కెరీర్‌లో 100వ టెస్టు వికెట్ మైలురాయిని చేరాడు. మార్లొన్ శామ్యూల్స్ కేవలం నాలుగు పరుగులు చేసి రనౌట్ కావడంతో విండీస్ కష్టాల్లో పడింది. జెర్మెయిన్ బ్లాక్‌వుడ్ (10)ను లియాన్ ఒక చక్కటి బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. అప్పటి వరకూ క్రీజ్‌లో నిలబడి, ఆసీస్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కొన్న కార్లొస్ బ్రాత్‌వెయిట్ 85 పరుగులు చేసి లియాన్ బౌలింగ్‌లోనే స్టీవెన్ స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి అవుట్‌కావడంతో విండీస్ కష్టాలు పెరిగాయి. కెప్టెన్ జాసన్ హోల్డర్ ఒక పరుగు చేసి, స్టీవ్ ఒకీఫ్ బౌలింగ్‌లో జో బర్న్స్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి విండీస్ 75 ఓవర్లలో ఆరు వికెట్లకు 207 పరుగులు సాధించగా, వికెట్‌కీపర్ దినేష్ రాందీన్ (23), కార్లొస్ బ్రాత్‌వెయిట్ (35) క్రీజ్‌లో ఉన్నారు. వీరి తర్వాత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయగల సామర్థ్యం గల ఆటగాళ్లు విండీస్ జట్టులో లేరు. దీనితో విండీస్ ఎక్కువ సేపు పోరాడి, 300 పరుగుల మైలురాయిని చేరడం కూడా కష్టంగానే కనిపిస్తున్నది.
సిడ్నీ మైదానంలో గత 15 సంవత్సరాల కాలంలో మొదటిసారి టెస్టు మ్యాచ్ ఆడుతున్న విండీస్ 1997 తర్వాత ఆస్ట్రేలియాలో ఒక్క టెస్టు విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది.