క్రీడాభూమి

స్వర్ణంతో ఫెల్ప్స్ గుడ్‌బై

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 14: అమెరికా స్విమ్మింగ్ సూపర్ స్టార్ మైఖేల్ ఫెల్ప్స్ కెరీర్‌లో 23వ స్వర్ణ పతకాన్ని సాధించి, ఈ మెగా ఈవెంట్‌కు గుడ్‌బై చెప్పాడు. పురుషుల 4న100మీటర్ల మెడ్లే రిలేలో ర్యాన్ మర్ఫీ, కొడీ మిల్లర్, ఫెల్ప్స్, నాథన్ ఆడ్రియన్ సభ్యులుగా ఉన్న అమెరికా జట్టు లక్ష్యాన్ని 3 నిమిషాల 27.95 సెకన్లలో ఈవెంట్‌ను పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. ఇది సరికొత్త ఒలింపిక్ రికార్డు. క్రిస్ వాటర్ హెబార్న్, ఆడం పిటీ, జేమ్స్ గయ్, డంకన్ స్కాట్‌లతో కూడిన బ్రిటన్ 3 నిమిషాల 29.24 సెకన్లలో గమ్యాన్ని చేరి రజత పతకాన్ని సొంతం చేసుకుంది. 3 నిమిషాల 29.93 సెకన్లతో ఆస్ట్రేలియా జట్టు కాంస్య పతకాన్ని సాధించింది. ఈ జట్టులో మిచెల్ లార్కిన్, జేక్ పాకార్డ్, డేవిడ్ మోర్గాన్, కేల్ చామర్స్ సభ్యులుగా ఉన్నారు.
ఐదు స్వర్ణాలు
ఈసారి ఒలింపిక్స్‌లో ఆరు ఈవెంట్స్‌లో పోటీపడిన ఫెల్ప్స్ మొత్తం ఐదు స్వర్ణ పతకాలను గెల్చుకున్నాడు. కేవలం ఒక విభాగంలో అతను అనూహ్యంగా రెండో స్థానంలో నిలిచి, రజత పతకంతో సంతృప్తి చెందాడు. మొత్తం మీద అతని ఖాతాలో 28 ఒలింపిక్స్ పతకాలు చేరాయి. వీటిలో 23 స్వర్ణం, 3 రజతంకాగా, రెండు కాంస్యాలు. ఒలింపిక్స్‌సహా అంతర్జాతీయ కెరీర్‌లో అతను 66 స్వర్ణాలు, 14 రజతాలు, 3 కాంస్యాలతో 83 పతకాలను గెల్చుకున్నాడు. అత్యధిక స్వర్ణాలు, అత్యధిక పతకాలు సాధించిన ఒకేక అథ్లెట్‌గా ఒలింపిక్స్ చరిత్రను తిరగరాసిన ఫెల్ప్స్ తన చివరి రేస్‌ను ముగించిన తర్వాత ఎంతో ఉద్వేగంతో కనిపించాడు. కుమారుడు బూమర్ రాబర్ట్ ఫెల్ప్స్‌ను ఎత్తుకొని రేస్‌ను తిలకించిన అతని గర్ల్‌ఫ్రెండ్ నికోల్ జాన్సన్ కన్నీళ్లు పెట్టుకుంది. రేస్ ముగిసిన వెంటనే ప్రేక్షకులు లేచి హర్షధ్వానాలతో ఫెల్ప్స్‌ను అభినందిస్తూ వీడ్కోలు పలికారు.
ఇక సెలవు
ఒలింపిక్స్ నుంచి సెలవు తీసుకుంటున్నానని మైఖేల్ ఫెల్ప్స్ ప్రకటించాడు. లండన్ ఒలింపిక్స్ ముగిసిన తర్వాత రిటైర్మెంట్ తీసుకున్న అతను ఆతర్వాత మనసు మార్చుకొని మళ్లీ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు తాను కొత్తగా సాధించాల్సిందిగానీ, తనను తాను నిరూపించుకోవాల్సిందిగానీ ఏమీ లేదని ఫెల్ప్స్ అన్నాడు. తనకు మద్దతునిచ్చిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. సహచరుల సహకారం లేకపోతే తనకు ఇంత గౌరవం దక్కేది కాదని అన్నాడు. అత్యుత్తమ స్థాయిలో ఒలింపిక్స్‌కు గుడ్‌బై చెప్తున్నానని, స్వర్ణంతో వీడ్కోలు పలకడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పాడు.