క్రీడాభూమి

ప్రీ క్వార్టర్స్‌కు శ్రీకాంత్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 14: బాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్ వరుసగా రెండో మ్యాచ్‌లో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్ చేరాడు. స్వీడన్‌కు చెందిన హెన్రీ హర్స్‌కైనెన్‌ను అతను 21-6, 21-15 తేడాతో వరుస సెట్లలో చిత్తుచేశాడు. అంతకు ముందు మొదటి రౌండ్‌లో అతను లినో మునొజ్ (మెక్సికో)పై 21-11, 21-17 ఆధిక్యంతో విజయం సాధించిన విషయం తెలిసిందే. సైనా నెహ్వాల్ మహిళల సింగిల్స్‌లో గ్రూప్ దశ నుంచే నిష్క్రమించిన నేపథ్యంలో భారత్‌కు బాడ్మింటన్‌లో పతకం అందించే బాధ్యత శ్రీకాంత్‌పై పడింది. అభిమానులు తనపై ఉంచిన అంచనాలకు తగినట్టుగానే అతను మొదటి రెండు మ్యాచ్‌ల్లో గెలిచి పతకంపై ఆశలు పెంచాడు.
సింధు ముందంజ
మహిళల సింగిల్స్‌లో సైనా నెహ్వాల్ ఓటమిపాలుకాగా, తెలుగు తే జం పివి సింధు రెండో రౌండ్‌ను సమర్థంగా పూర్తి చేసి, ముందంజ వే సింది. కెనడాకు చెందిన మిచెలె లీని ఢీకొన్న ఆమె 19-21, 21-15, 21-17 తేడాతో విజయం సాధించి, ప్రీ క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. అ టు పురుషులు, ఇటు మహిళల విభాగాల్లో తెలుగు వారే పతకాలపై ఆ శలను సజీవంగా నిలపడం విశేషం. కాగా, పురుషుల డబుల్స్‌లో మను అత్రి, సుమీత్ రెడ్డి జోడీ ఓటమిపాలైంది.