క్రీడాభూమి

400 మీటర్ల పరుగులో నీకెర్క్ ప్రపంచ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 15: దక్షిణాఫ్రికా అథ్లెట్ వేడ్ వాన్ నీకెర్క్ పురుషుల 400 మీటర్ల పరుగులో కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. లక్ష్యాన్ని 43.03 సెకన్లలో చేరిన అతను 17 ఏళ్ల క్రితం నాటి రికార్డును తిరగరాశాడు. 1996 ఆగస్టు 26న స్పెయిన్‌లోని సెవిల్లేలో జరిగిన అథ్లెటిక్ మీట్‌లో 43.18 సెకన్లతో రికార్డును సృష్టించిన మైఖేల్ జాన్సన్‌ను రెండో స్థానానికి నెట్టేశాడు. జాన్సన్ రికార్డును అధిగమించే మాట ఎలావున్నా, కనీసం సమం చేయడం కూడా సాధ్యం కాదని క్రీడా నిపుణులు అప్పట్లో వ్యాఖ్యానించారు. కానీ, రికార్డులు నెలకొనేది బద్దలు కావడానికేనని నీకెర్క్ నిరూపించాడు. అతను ఫినిషింగ్ లైన్‌ను చేరుకున్న 0.73 సెకన్ల తర్వాత గ్రెనడా అత్లెట్ కిరనీ జేమ్స్ గమ్యాన్ని చేరి రజత పతకాన్ని అందుకున్నాడు. అమెరికాకు చెందిన లాషాన్ మెరిట్ 43.85 సెకన్లతో కాంస్య పతకాన్ని స్వీకరించాడు.

చిత్రం.. వేడ్ వాన్ నీకెర్క్