క్రీడాభూమి

శ్రీలంక క్రికెట్ ఎన్నికల్లో అర్జున రణతుంగకు షాక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, జనవరి 3: శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సి) ఎన్నికల్లో మాజీ కెప్టెన్, దేశ పోర్ట్స్ అండ్ షిప్పింగ్ శాఖ మంత్రి అర్జున రణతుంగకు చేదు అనుభవం ఎదురైంది. తన సోదరుడు నిశాంత రణతుంగను అధ్యక్షుడిగా గెలిపించులేకపోయాడు. అంతేగాక, తాను ఉపాధ్యక్ష పదవికి స్వయంగా పోటీ చేసి ఓటమిపాలయ్యాడు. అతనిపై జయంత ధర్మదాస 22 ఓట్ల తేడాతో విజయభేరి మోగించాడు. శ్రీలంక పార్లమెంటులో డిప్యూటీ స్పీకర్‌గా సేవలు అందిస్తున్న తిలంగ సుమతిపాల 88 ఓట్లు సంపాదించగా, నిశాంతకు 56 ఓట్లు దక్కాయి. కాగా, సుమతిపాల మూడోసారి ఎస్‌ఎల్‌సి అధ్యక్షుడిగా ఎన్నిక కావడం విశేషం. గత రెండు పర్యాయాలు అతను అధ్యక్ష స్థానానికి ఎన్నికైనప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకొని, బోర్డు కార్యవర్గాన్ని రద్దు చేసి, మధ్యంతర కమిటీని నియమించింది. బోర్డు వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అధికార దుర్వినియోగం జరిగిందని లంక ప్రభుత్వం పదేపదే ఆరోపిస్తున్నది. ఇటీవలే ఒక విచారణ కమిటీని కూడా నియమించింది. ఇలావుంటే, పూర్తి స్థాయిలో ఆధిపత్యం లభించిందన్న నమ్మకం కలిగిన తర్వాత ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ, అనుకున్న ఫలితాన్ని రాబట్టుకోలేకపోయింది. అధ్యక్షుడిగా సుమతిపాల, ఉపాధ్యక్షుడిగా జయంత ధర్మదాస, ప్రధాన కార్యదర్శిగా మోహన్ డి సిల్వ ఎన్నిక కావడంతో, అర్జున శిబిరం చావు దెబ్బతింది. గతంలో సుమతిపాల అధ్యక్షుడిగా, మోహన్ డి సిల్వ కార్యదర్శిగా కలిసి పని చేశారు. మరోసారి ఇద్దరూ అవే పదవులకు ఎన్నికయ్యారు.

శ్రీలంక క్రికెట్ ఎన్నికల్లో ఓడిన అర్జున రణతుంగ