క్రీడాభూమి

నన్ను పెళ్లాడతావా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 15: కొన్ని వేల మంది రియో ఒలింపిక్స్ అక్వాటిక్ స్టేడియంలో ప్రత్యక్షంగా, కోట్లాది మంది పరోక్షంగా టీవీల్లో వీక్షిస్తుండగా, చైనా డైవర్ హీ జీకి తన దేశానికే చెందిన కిన్ కాయ్ ప్రపోజ్ చేశాడు. మహిళల మడు మీటర్ల స్ప్రింగ్ బోర్డు విభాగంలో హీ జీ రజత పతకాన్ని గెల్చుకుంది. పోడియం వద్ద పతాకాన్ని స్వీకరించిన వెంటనే కిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఆమె ముందు మోకాలిపై కూర్చుకున్నాడు. సిద్ధంగా ఉంచుకున్న వజ్రపు ఉంగరాన్ని ఇస్తూ ‘నన్ను పెళ్లాడతావా’ అని అడిగాడు. పురుషుల డైవింగ్‌లో కాంస్య పతకాన్ని సాధించిన కిన్‌తో హీ జీ సుమారు ఆరేళ్లుగా ప్రేమాయణం సాగిస్తున్నది. రియోలో ఈ విధంగా ప్రతిపాదిస్తాడని తాను ఊహించలేదని హీ జీ ముసిముసి నవ్వులు చిందిస్తూ చెప్పింది. కిన్ ఎన్నో ప్రమాణాలు చేశాడని, చాలాకాలంగా అతని గురించి తెలుసుకాబట్టి, భవిష్యత్తును అతనితోనే గడపాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. రియో ఒలింపిక్స్ ఈ విధంగా పెళ్లి ప్రతిపాదనకు వేదిక కావడం ఇది రెండోసారి. గత సోమవారం బ్రెజిల్ రగ్బీ ఆటగాడు ఇసడొరా సెరలో తన గర్ల్‌ఫ్రెండ్ మర్జోరీ ఎన్యాకు ప్రపోజ్ చేశాడు. కానీ, అతను కేవలం మాటల్లోనే తన అభిప్రాయాన్ని తెలిపితే, కిన్ డైమండ్ రింగ్‌ను బహూకరించి మరీ ప్రపోజ్ చేశాడు. ఇంకెంత రియోను పెళ్లి ప్రతిపాదనల వేదికగా మార్చుకుంటారో చూడాలి.

చిత్రం.. హీ జీకి ప్రపోజ్ చేస్తున్న కిన్ కాయ్