క్రీడాభూమి

తిండి లేక.. రియోలో తిప్పలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 16: ప్రస్తుతం రియో డి జెనిరోలో ఉన్న భారత ఒలింపిక్ క్రీడా బృందంలోని కొంత మంది సభ్యులు సోమవారం తిండి లేక నానా తిప్పలు పడ్డారు. అక్కడి భారత రాయబార కార్యాలయంలో స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరైనప్పుడు వారికి ఈ పరిస్థితి ఎదురైంది. ఈ వేడుకల సందర్భంగా అక్కడి అధికారులు కేవలం వేరుశెనగ పప్పులు పంచి చేతులు దులుపుకోవడంతో భోజనం లేక క్రీడాకారులు ఆకలితో అలమటించారు. కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రియో ఒలింపిక్స్‌లో ఇప్పటికే పోటీ నుంచి నిష్క్రమించిన రెండు హాకీ జట్ల సభ్యులు హాజరయ్యారు. స్వాతంత్య్ర దిన వేడుకల సందర్భంగా తమకు భోజన వసతి ఏర్పాటు చేస్తారని భావించిన క్రీడాకారులు ఒలింపిక్ విలేజ్‌లో భోజనం చేయకుండా వచ్చారు. అయితే వేడులక సందర్భంగా భారత రాయబార కార్యాలయ అధికారులు కేవలం వేరుశెనగ పప్పులు పంచి చేతులు దులుపుకోవడంతో క్రీడాకారులు ఆకలితో పస్తుండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయమై భారత చెఫ్ డీ మిషన్ రాకేష్ గుప్తాను ప్రశ్నించగా, ‘దయచేసి దీని గురించి హాకీ ఆటగాళ్లనే అడగండి. వారే బాగా చెబుతారు. నేను కేవలం రాయబార కార్యాలయాన్ని సందర్శించి వికాస్ కృష్ణన్ బాక్సింగ్ బౌట్ కోసం వెంటనే అక్కడి నుంచి తిరిగి వచ్చేశా’ అని నవ్వుతూ చెప్పారు.
కాగా, భారత రాయబార కార్యాలయ అధికారుల నిర్వాకంపై హాకీ జట్టుకు చెందిన ఒక సభ్యుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేశాడు. ‘దేశం పట్ల ఎంతో అభిమానంతో ఈ వేడుకలకు హాజరయ్యాం. రాయబార కార్యాలయంలో కనీసం భోజనమైనా పెట్టకపోతారా అని భావించి ఒలింపిక్ విలేజ్‌లో భోజనం చేయకుండా వచ్చాం. తీరా చూస్తే ఈ వేడుకల్లో అధికారులు బీరు, కొన్ని శీతల పానీయాలు, వేరుశెనగ పప్పులు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో మేమంతా ఆకలితో అలమటిస్తూ పస్తు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఎంతో విచారాన్ని కలిగించింది’ అని అతను వాపోయాడు.

చిత్రం..రియోలోని భారత రాయబార కార్యాలయంలో
స్వాతంత్య్ర దిన వేడుకలకు హాజరైన క్రీడాకారులు, ఆహూతులు