క్రీడాభూమి

నర్సింగ్ యాదవ్ భవిత మళ్లీ ప్రశ్నార్థకం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జనిరో, ఆగస్టు 16: రియో ఒలింపిక్స్‌లో వరస వైఫల్యాలతోఅల్లాడిపోతున్న భారత్ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. రెజ్లర్ నర్సింగ్ యాదవ్ ఒలింపిక్స్‌లో పాల్గొనడంపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. అంతేకాదు, అతని భవిష్యత్తు సైతం ప్రశ్నార్థకంగా మారింది. డోపింగ్ కుట్ర కేసులో నర్సింగ్‌కు జాతీయ డోపింగ్ వ్యతిరేక సంఘం(నాడా) క్లీన్ చిట్ ఇవ్వడంపై ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజన్సీ (వాడా) క్రీడల ఆర్బిట్రేషన్ కోర్టులో అపీలు చేసింది. ప్రస్తుతం ఈ కేసులో విచారణ జరుగుతోందని, భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సెక్రటరీ జనరల్ రాజీవ్ మెహతా వాడా అధికారుతో చర్చిస్తున్నారని భారత క్రీడాబృందం చీఫ్ డి మిషన్ రాకేశ్ గుప్తా పిటిఐకి చెప్పారు. ఒక వేళ ఆర్బిట్రేషన్ కోర్టు గనుక వాడా అపీల్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చినట్లయితే నర్సింగ్ ఒలింపిక్ గేమ్స్‌లో పాల్గొనలేడు సరికదా, నాలుగేళ్ల పాటు అతను నిషేధాన్ని సైతం ఎదుర్కోవలసి వస్తుంది. నర్సింగ్ 74 కిలోల ఫ్రీ స్టైల్ విభాగంలో ఈ నెల 19న పోటీ పడాల్సి ఉంది.
గత జూన్ 25న నిర్వహించిన డోపింగ్ పరీక్షలో నర్సింగ్ విఫలమయ్యాడు. అతని శాంపిల్‌లో నిషేధిత ఉత్ప్రేరకం మిథేన్ డైడోన్ అధిక మోతాదులో ఉన్నట్లు తేలింది. అయితే తనను అన్యాయంగా కుట్రలో ఇరికించారని నర్సింగ్ వాదించడంతో విచారించిన నాడా అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు అంతర్జాతీయ రెజ్లింగ్ సమాఖ్య కూడా అనుమతించింది. ఆ తర్వాత నాడా క్లీన్‌చిట్ ఫైల్‌ను వాడాకు పంపించింది. కేసు ఫైలును పరిశీలించి సంతృప్తి చెందని పక్షంలో వాడా అపీలు చేస్తుంది. మరో రెండు రోజుల్లో ఒలింపిక్స్‌లో పాల్గొననున్న తరుణంగా ఇలా జరగడం నిజంగా భారత శిబిరంలో నిరాశా నీడలు కమ్ముకునేలా చేశాయి. ఇప్పటికే పాల్గొన్న క్రీడాకారులంతా వరసగా విఫలమవుతూ వస్తున్న తరుణంలో భారత్ పతకం ఆశలన్నీ బ్యాడ్మింటన్, రెజ్లింగ్‌పైనే ఉన్నాయి. నాలుగేళ్ల క్రితం జరిగిన లండన్ ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు సాధించిన భారత్ కనీసం ఆ మాత్రమైనా పతకాలు సాధించాలంటే ఈ రెండు విభాగాలలో మనవాళ్లు రాణించాలి.