క్రీడాభూమి

రియోలో ‘తెలుగు తేజం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 16: ప్రపంచ చాంపియన్‌షిప్స్‌లో రెండుసార్లు కాంస్య పతకాన్ని గెలుచుకున్న ‘తెలుగు తేజం’ పివి.సింధు రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారు జామున జరిగిన మహిళల సింగిల్స్ బాడ్మింటన్ ప్రీ-క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె వరుస గేముల తేడాతో చైనీస్ తైపీకి చెందిన తై జు ఇంగ్‌ను మట్టికరిపించి పతకాన్ని సాధించే దిశగా మరో అడుగు ముందుకు వేసింది. 40 నిమిషాల పాటు ఎంతో ఆసక్తికరంగా జరిగిన ఈ పోరులో 21-13, 21-15 తేడాతో ప్రత్యర్థిని చిత్తు చేసిన సింధు సెమీస్‌లో స్థానం కోసం లండన్ ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని గెలుచుకున్న చైనా క్రీడాకారిణి వాంగ్ ఇహన్ (ప్రపంచ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానం)తో అమీతుమీ తేల్చుకోనుంది. తై జుపై ఇప్పటివరకూ ఆరుసార్లు తలపడిన సింధుకి ఇది రెండో విజయం. గత ఏడాది డెన్మార్క్‌లో తొలిసారి తై జును ఓడించిన సింధు తాజాగా ఒలింపిక్ మ్యాచ్‌లో మరోసారి విజృంభించి ఆరంభంలోనే 3-1 ఆధిక్యత సాధించింది. ఆ తర్వాత తై జు కాస్త పుంజుకుని 5-5 తేడాతో స్కోరును సమం చేసినప్పటికీ బ్రేక్ సమయానికి సింధు 11-6 తేడాతో ఆధిక్యతలో నిలిచింది. అనంతరం కొద్దిసేపు సింధును బోల్తా కొట్టించే విధంగా ఆడిన తై జు తమ మధ్య తేడాను 10-12కు తగ్గించ గలిగినప్పటికీ అంతే స్థాయిలో తప్పిదాలకు పాల్పడింది. దీనిని ఆసరాగా చేసుకుని వీడియో రిఫరల్ ద్వారా 20-13 తేడాతో గేమ్ పాయింట్‌కు చేరుకున్న సింధు ఆ తర్వాత తై జు కొట్టిన వైడ్‌తో సునాయాసంగా తొలి గేమ్‌ను గెలుచుకుంది. హోరాహోరీగా సాగిన రెండో గేమ్ ఆరంభంలో సింధుకు గట్టిపోటీ ఇచ్చిన తై జు ఒకానొక దశలో 6-6 తేడాతో స్కోరును సమం చేసినప్పటికీ అనవసరమైన తప్పిదాలకు పాల్పడి విరామ సమయానికి 11-6 తేడాతో వెనుకబడింది. ఆ తర్వాత సింధుపై వత్తిడి పెంచేందుకు తై జు విశ్వప్రయత్నం చేసినప్పటికీ ఫినిషింగ్ టచ్ ఇవ్వడంలో ఆమె విఫలమైంది. దీంతో 14-7 తేడాతో మరింత ఆధిక్యతలోకి దూసుకెళ్లిన సింధును తై జు ఇక ఏమాత్రం కట్టడి చేయలేక 21-15 తేడాతో ఆ గేమ్‌ను కూడా చేజార్చుకుని ఓటమి పాలైంది.