క్రీడాభూమి

ఖేల్ రత్న ఎవరికి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 17: భారత క్రీడా రంగంలో ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డు ఈ ఏడాది ఎవరికి దక్కుతుందనే ప్రశ్న ఉత్కంఠ రేపుతోంది. రియో ఒలింపిక్స్‌కు అర్హత సంపాదించి సంచలనం సృష్టించిన మహిళా జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు ఈ అవార్డు దక్కాలన్న డిమాండ్ వినిపిస్తున్నది. ఒలింపిక్స్‌లోకి అడుగుపెట్టడమేగాక, చివరి వరకూ తీవ్ర స్థాయిలో పోరాడిన ఆమె నాలుగో స్థానంలో నిలిచిన విషయం తెలిసిందే. దీప ఓడినప్పటికీ, ఆమె పడిన కష్టం ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. అందుకే ఆమె పేరును భారత జిమ్నాస్టిక్స్ సంఘం ప్రతిపాదించే అవకాశాలున్నాయి. ఖేల్ రత్న అవార్డుకు దీప పేరును ప్రతిపాదించే విషయంపై జిమ్నాస్టిక్స్ సంఘం గురువారం తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇలావుంటే, ఏస్ షూటర్ జితూ రాయ్ పేరు తెరపైకి వచ్చింది. అతని పేరును ఖేల్ రత్నకు ప్రతిపాదించినట్టు భారత జాతీయ రైఫిల్ సంఘం (ఎన్‌ఆర్‌ఎఐ) కార్యదర్శి రాజీవ్ భాటియా ప్రకటించాడు. 29 ఏళ్ల జీతూ పేరును సిఫార్సు చేస్తూ కేంద్రానికి లేఖ రాసినట్టు తెలిపాడు. ట్రాక్ రికార్డు ఆధారంగానే అవార్డుకు ఎంపిక జరుగుతుంది కాబట్టి జీతూ పేరును కొట్టిపారేయడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది. కోట్లాది మంది అభిమానులను ఆకట్టుకున్న దీప ఒకవైపు, షూటింగ్‌లో ఎన్నో సంచలన విజయాలను సాధించిన జీతు మరోవైపు పోటీలో ఉంటే, కేంద్రం ఎటువైపు మొగ్గు చూపుతుందో చూడాలి. ఇద్దరికీ సంయుక్తంగా అవార్డును ప్రకటించినా ఆశ్చర్యం లేదు. అయితే, ఈలోగా మరింత మంది పేర్లు తెరపైకి వస్తాయో చూడాలి. కేంద్ర ప్రభుత్వం నియమించే అవార్డుల కమిటీ నిర్ణయం మేరకు ఖేల్ రత్న అవార్డును ఈనెల 29న జరిగే జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ ప్రదానం చేస్తారు.

చిత్రాలు.. సంచలనాల యువ జిమ్నాస్ట్ దీపా కర్మాకర్
ఖేల్త్న్ర రేసులో ఉన్న ఏస్ షూటర్ జీతూ రాయ్