క్రీడాభూమి

వెయిట్ లిఫ్టింగ్‌లో సలిమీ రికార్డు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: ఇరాన్ వెయిట్‌లిఫ్టర్ బెదాద్ సలీమికొర్డాసియాబి కొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. పురుషుల 105 కిలోలకు మించిన సూపర్ హెవీవెయిట్ ఈవెంట్ స్నాచ్‌లో అతను 216 కిలోల బరువునెత్తాడు. సలీమీగా అందరికీ సుపరచితుడైన అతను జార్జియాకు చెందిన లషా తలకజే రికార్డును బద్దలు చేశాడు. తలకజే 215 కిలోలతో రికార్డు నెలకొల్పగా సలీమీ ఆ దానిని అధిగమించాడు. అయితే, అతనికి స్వర్ణ పతకం దక్కలేదు. క్లీన్ అండ్ జర్క్‌లో మూడు ప్రయత్నాల్లోనూ విఫలమైన అతను పతకం రేసులో నిలవలేకపోయాడు. స్నాచ్, క్లీన్ అండ్ జెర్క్‌లలో మొత్తం 473 కిలోల బరువునెత్తిన లషా తలకజేకు స్వర్ణ పతకం లభించింది. ఆర్మేనియాకు చెందిన గొర్ మినాస్యాన్ 451 కిలోల బరువును ఎత్తడం ద్వారా రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. జార్జియా లిఫ్టర్ ఎరాక్లి టర్మానిజే 448 కిలోలతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు.

చిత్రం.. ప్రపంచ రికార్డు సృష్టించిన ఇరాన్ వెయిట్‌లిఫ్టర్ బెదాద్ సలీమి