క్రీడాభూమి

నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 19: డోపింగ్ కేసులో తనపై నాలుగేళ్ల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) ఇచ్చిన తీర్పు పట్ల రెజ్లర్ నర్సింగ్ యాదవ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తానని అతను స్పష్టం చేశాడు. ‘సిఎఎస్ నిర్ణయం తీవ్ర ఆవేదన కలిగించింది. డోపింగ్ వ్యవహారంలో గత రెండు నెలల నుంచి ఎన్నో సమస్యలకు ఎదురీదిన నేను ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించి దేశ కీర్తిప్రతిష్టలను ఇనుమడింప జేయాలన్న కొండంత ఆశతో ఇక్కడి వరకూ వచ్చా. కానీ రియోలో తొలి పోరాటాన్ని ప్రారంభించడానికి 12 గంటల ముందే అత్యంత కర్కశంగా నా ఆశలను అణచివేశారు. అయినప్పటికీ నా నిర్ధోషిత్వాన్ని నిరూపించుకునేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తా. ఇప్పుడు నేను చేయాల్సిన పోరాటం ఇదే’ అని నర్సింగ్ యాదవ్ తన స్పాన్సర్ జెఎస్‌డబ్ల్యు స్పోర్ట్స్ ద్వారా శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశాడు. డోపింగ్ వ్యవహారంలో తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగిందని నర్సింగ్ యాదవ్ మొదటి నుంచీ వాదిస్తున్న విషయం తెలిసిందే. ఈ వాదనకు బలం చేకూర్చే సాక్ష్యాధారాలు ఏమైనా లభ్యమైతే సిఎస్‌ఎ తీర్పుపై అప్పీలుకు వెళ్లే అవకాశం ఉంటుందని నర్సింగ్ యాదవ్ ఆ ప్రకటనలో పేర్కొన్నాడు. ఏది ఏమైనప్పటికీ డోపింగ్ వ్యవహారంలో నర్సింగ్ యాదవ్ తప్పేమీ లేదని బలంగా విశ్వసిస్తున్నామని, కనుక న్యాయ పోరాటంలో అతనికి అన్ని విధాలా అండగా నిలుస్తామని జెఎస్‌డబ్ల్యు స్పోర్ట్స్ తెలిపింది.