క్రీడాభూమి

చండీలా, హికేన్‌పై చర్యలు నేడు ఖరారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 4: బుకీలతో కుమ్మక్కయి స్పాట్ ఫిక్సింగ్‌కు సహకరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజస్థాన్ రాయల్స్ మాజీ ఆటగాడు అజిత్ చండీలా, హికేన్ షాపై తీసుకునే చర్యలను బిసిసిఐ క్రమశిక్షణా సంఘం మంగళవారం ఖరారు చేయనుంది. బోర్డు అధ్యక్షుడు శశాంక్ మనోహర్ అధ్యక్షతన సమావేశం కానున్న కమిటీలో జ్యోతిరాదిత్య సింధియా, నిరంజన్ షా సభ్యులుగా ఉంటారు. 2013 ఐపిఎల్ సమయంలో స్పాట్ ఫిక్సింగ్ కేసు వెలుగులోకి వచ్చినప్పుడు శ్రీశాంత్, అంకిత్ చవాన్‌తోపాటు చండీలా కూడా అరెస్టయ్యాడు. అయితే, స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలున్న మ్యాచ్‌లో శ్రీశాంత్, చవాన్ ఆడగా, చండీలా ఆడలేదు. తాను మ్యాచ్‌లో లేనని, కాబట్టి ఫిక్సింగ్‌కు పాల్పడే అవకాశమే ఉండదని అతను వాదిస్తూ వచ్చాడు. ఇలావుంటే, తమను బుకీలకు హికేన్ షా పరిచయం చేశాడంటూ పలువురు క్రికెటర్లు ఆరోపించారు. అప్పటి నుంచి చండీలా, హికేన్ కేసు విచారణ జరుగుతునే ఉంది. మంగళవారం వీరికి శిక్ష ఖరారవుతుంది.

సిడ్నీ టెస్టుకు వర్షం బెడద
సిడ్నీ, జనవరి 4: ఆస్ట్రేలియా, వెస్టిండీస్ జట్ల మధ్య ఇక్కడ జరుగుతున్న మూడవ, చివరి టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటను వర్షం వెంటాడింది. కేవలం 11.2 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆరు వికెట్లకు 207 పరుగుల ఓవర్‌నైట్ స్కోరుతో సోమవారం ఉదయం ఆటను కొనసాగించిన వెస్టిండీస్ 246 పరుగుల వద్ద ఏడో వికెట్‌కు కార్లొస్ బ్రాత్‌వెయిట్ రూపంలో కోల్పోయింది. వేగంగా పరుగులు రాబట్టేందుకు ప్రయత్నించిన అతను 71 బంతులు ఎదుర్కొని, ఏడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 69 పరుగులు చేసి జేమ్స్ పాటిన్సన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం మూడు బంతులు మాత్రమే బౌల్ అయ్యాయి. విండీస్ 86.2 ఓవర్లలో ఏడు వికెట్లకు 248 పరుగులకు చేరుకున్న సమయంలో భారీ వర్షం కురవడంతో ఆటను నిలిపివేశారు. అప్పటికి వికెట్‌కీపర్-బ్యాట్స్‌మన్ దనీష్ రాందీన్ (30), కెమర్ రోచ్ (0) క్రీజ్‌లో ఉన్నారు.