క్రీడాభూమి

నర్సింగ్ యాదవ్ ఆశలపై నీళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనిరో, ఆగస్టు 19: ఒలింపిక్స్‌లో భారత్‌కు పతకాన్ని తీసుకురావాలని ఎంతో ఆశతో రియోకి వెళ్లిన రెజ్లర్ నర్సింగ్ యాదవ్‌కు తీవ్రమైన నిరాశ ఎదురైంది. డోపింగ్ కేసులో నర్సింగ్ యాదవ్‌కు జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) ఇచ్చిన క్లీన్ చిట్‌ను అంతర్జాతీయ క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు (సిఎఎస్) తోసిపుచ్చి నాలుగేళ్ల నిషేధం విధించడంతో బరిలోకి దిగకముందే అతని ఆశలు నీరుగారి పోయాయి. వాస్తవానికి నర్సింగ్ యాదవ్ రియోలో శుక్రవారం తన పోరాటాన్ని ప్రారంభించాల్సి ఉంది. అయితే నర్సింగ్ యాదవ్‌కు నాడా క్లీన్ చిట్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) మూడు రోజుల క్రితం చేసుకున్న అప్పీలును క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు సమర్ధించడంతో అతను చివరి నిమిషాల్లో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ‘వాడా అప్పీలును సమర్ధించి నర్సింగ్ యాదవ్‌పై నాలుగేళ్ల నిషేధం విధిస్తున్నాం. ఈ నిషేధం శుక్రవారం నుంచే అమల్లోకి వస్తుంది. ఇంతకుముందు అతనిపై విధించిన ప్రాథమిక సస్పెన్షన్ కాలం కూడా ఈ నాలుగేళ్ల నిషేధం పరిధిలోకి వస్తుందని సంబంధిత పక్షాలకు తెలియజేస్తున్నాం’ అని క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. వాడా అప్పీలుపై గురువారం రాత్రి నాలుగు గంటల పాటు సుదీర్ఘ విచారణ జరిపిన తర్వాత క్రీడా మధ్యవర్తిత్వ కోర్టు ఈ ప్రకటన విడుదల చేసింది. ఈ ఏడాది జూన్ 25వ తేదీ నుంచి నర్సింగ్ యాదవ్ ఏ పోటీల్లో అయినా పతకాలు గానీ బహుమతులు గానీ సాధించి ఉంటే వాటన్నింటినీ అనర్హమైనవిగా పరిగణిస్తున్నామని సిఎఎస్ ఆ ప్రకటనలో వెల్లడించింది. డోపింగ్ వ్యవహారంలో తన ప్రమేయం ఏమీ లేదని, ఈ కేసులో తాను బాధితుడినని నర్సింగ్ యాదవ్ చేసిన వాదనను సిఎఎస్ ఆమోదించలేదు. ఈ వ్యవహారంలో నర్సింగ్ యాదవ్ తప్పు లేదని, అలాగే అతను ఉద్దేశ్యపూర్వకంగా డోపింగ్ నిబంధనను ఉల్లంఘించలేదని చెప్పేందుకు గానీ ఎటువంటి సాక్ష్యాధారాలు లేవని సిఎఎస్ పేర్కొంది.
కోర్టును ఒప్పించలేకపోయాం : డబ్ల్యుఎఫ్‌ఐ
ఇదిలావుంటే, డోపింగ్ వ్యవహారంలో నర్సింగ్ యాదవ్ కుట్రకు బలైపోయాడని, ఈ విషయమై తాము క్రీడా న్యాయస్థానాన్ని ఒప్పించలేకపోవడంతో అతను నాలుగేళ్లు నిషేధానికి గురవడంతో పాటు ఒలింపిక్స్‌కు దూరమవ్వాల్సి వచ్చిందని భారత రెజ్లింగ్ సమాఖ్య విచారాన్ని వ్యక్తం చేసింది. ఈ కుంభకోణానికి కారణమేమిటో తెలుసుకోకుండా క్రీడా న్యాయస్థానం మొండిగా వ్యవహరించిందని, నర్సింగ్ యాదవ్‌కు వ్యతిరేకంగా కుట్ర జరిగిందన్న మాట నిజమైతే అందుకు కారకులైన వారిని ఎందుకు శిక్షించలేదని, కనీసం నిందితులను ఎందుకు అరెస్టు చేయలేదని సిఎఎస్ ప్రశ్నించినట్లు తెలుస్తోందని డబ్ల్యుఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ వాపోయాడు.
సహచరులే కారణం : ఐఓఎ
కాగా, నర్సింగ్ యాదవ్ నాలుగేళ్ల పాటు నిషేధానికి గురై ఒలింపిక్స్‌కు దూరమవడానికి అతని సహచరులే కారణమని భారత ఒలింపిక్ సంఘం (ఐఓఎ) ధ్వజమెత్తింది. ‘నర్సింగ్ యాదవ్‌కు నష్టం జరగడానికి కేవలం సిఎస్‌ఎ తీర్పు ఒక్కటే కారణం కాదు. ఒలింపిక్స్‌లో నర్సింగ్ పాల్గొనడం ఇష్టంలేక ప్రత్యర్థులుగా మారిన కొంత మంది సహచరులు కూడా ఇందుకు కారణం’ అని ఐఓఎ ప్రధాన కార్యదర్శి రాజీవ్ మెహతా శుక్రవారం పిటిఐ వార్తా సంస్థతో అన్నారు.

సిఎస్‌ఎ తీర్పుతో ఖిన్నుడైన నర్సింగ్ యాదవ్