క్రీడాభూమి

బోల్ట్‌కు స్ప్రింట్ డబుల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 19: ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ స్ప్రింట్‌లో తనకు తిరుగులేదని మరోసారి రుజువు చేశాడు. రియో ఒలింపిక్స్ 100 మీటర్ల పరుగులో స్వర్ణం సాధించిన అతను తాజాగా 200 మీటర్ల విభాగంలోనూ విజేతగా నిలిచాడు. 19.78 సెకన్లలో గమ్యాన్ని చేరిన అతను స్ప్రింట్ డబుల్‌ను సాధించాడు. బీజింగ్ ఒలింపిక్స్‌లో 100 మీటర్లు, 200 మీటర్ల పరుగుతోపాటు 4న100 మీటర్ల రిలేలోనూ స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో అదే ఫీట్‌ను పునరావృతం చేశాడు. రియో ఒలింపిక్స్‌లో మరోసారి అదే స్థాయిలో రాణించి, ‘ట్రిపుల్ ట్రిపుల్’ను సాధించే దిశగా బోల్ట్ మరో అడుగు ముందుకేశాడు. కెనడా రన్నర్ ఆండ్రె డి గ్రాస్ 20.02 సెకన్లలో రేస్‌ను పూర్తి చేసి రజత పతకాన్ని స్వీకరించాడు. ఫ్రాన్స్‌కు చెందిన క్రిస్ట్ఫో లెమైటర్ 20.12 సెకన్లతో కాంస్య పతకాన్ని అందుకున్నాడు. ‘ట్రిపుల్’ హ్యాట్రిక్‌ను సాధించే దిశగా దూసుకెళుతున్న బోల్ట్ శనివారం జరిగే రిలే ఈవెంట్‌లో పోటీపడతాడు. అందులో జమైకా విజేతగా నిలిస్తే, బోల్ట్ ముచ్చటగా మూడోసారి ‘ట్రిపుల్’ను పూర్తి చేస్తాడు.
నేనే గ్రేట్!
క్రీడా రంగంలో అత్యుత్తమ అథ్లెట్ల జాబితాలో తాను కూడా చేరతానని, ప్రస్తుతానికి తనను మించిన వారు లేరని 200 మీటర్ల పరుగులో స్వర్ణ పతకాన్ని సాధించిన బోల్ట్ వ్యాఖ్యానించాడు. రియోలో ఐదు స్వర్ణాలను అందుకున్న అమెరికా స్విమ్మర్ మైఖేల్ ఫెల్ప్స్‌ను ఆల్‌టైమ్ గ్రేట్‌గా పేర్కొంటున్నారు. మొత్తం 23 ఒలింపిక్ స్వర్ణ పతకాలను సాధించిన అతను రియో ఒలింపిక్స్‌లోనూ మేటిగా రికార్డు సృష్టించాడు. అయితే, ఫెల్ప్స్ ఆధిక్యాన్ని అంగీకరించడానికి బోల్ట్ సిద్ధంగా లేడు. స్ప్రింట్‌ను స్విమ్మింగ్‌తో పోల్చడానికి వీల్లేదని అతను అన్నాడు. రెండికీ మధ్య ఎంతో వ్యత్యాసం ఉందని, కాబట్టి ఫెల్ప్స్ అసాధారణ ఒలింపియన్ అవునా కాదా అన్నది తాను చెప్పలేనని అన్నాడు. అయితే, తాను మాత్రం మేటి అథ్లెట్ల సరసన స్థానం సంపాదించుకున్నానని చెప్పాడు. తన వల్లే స్ప్రింట్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడిందని, అభిమానులను తాను ఎంతగానో అలరించానని అన్నాడు. రిలేలోనూ స్వర్ణ పతకాన్ని అందుకుంటానని ధీమా వ్యక్తం చేశాడు.