క్రీడాభూమి

ఒలింపిక్ బాడ్మింటన్ విజేత మారిన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 19: రియో ఒలింపిక్స్‌లో భారత బాడ్మింటన్ స్టార్, హైదరాబాదీ పివి సింధు మహిళల సింగిల్స్ ఫైనల్‌లో ప్రపంచ నంబర్ వన్ కరోలినా మారిన్ చేతిలో ఓడినప్పటికీ, లక్షలాది మంది అభిమానుల మనసులు గెల్చుకుంది. స్పెయిన్‌కు చెందిన మారిన్‌తో తలపడిన సింధు కడవరకూ పోరాడింది. ప్రత్యర్థికి అడుగడుగునా సవాళ్లు విసిరింది. తిరుగులేని స్మాష్‌లు, అద్భుతమైన ప్లేసింగ్స్‌తో విజయంపై ఆశలు పెంచింది. కానీ, మారిన్ సామర్థ్యం ముందు సింధు పోరాటం సఫలం కాలేదు. మ్యాచ్‌ని 21-19, 12-21, 15-21 తేడాతో చేజార్చుకొని రజత పతకానికి పరిమితమైంది. ఫైనల్‌లో పరాజయాన్ని ఎదుర్కొన్నప్పటికీ భారత్‌కు రజత పతకాన్ని అందించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
పతకాలతో తిరిగి వస్తారనుకున్న సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్, జ్వాలా గుత్తా, అశ్వినీ పొన్నప్ప వంటి స్టార్లు విఫలంకాగా, ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగిన సింధు అద్భుతాలను ఆవిష్కరించింది. హంగరీ క్రీడాకారిణి లారా సరొసీని 21-8, 21-9 తేడాతో ఓడించిన ఆమె రెండో రౌండ్‌లో కెనడాకు చెందిన మిచెల్ లీపై 6-21, 21-15, 21-15, 21-17 ఆధిక్యంతో విజయం సాధించి ప్రీ క్వార్టర్స్‌కు, ఆ తర్వాత తాయ్ జూ ఇంగ్‌ను 21-13, 21-15 స్కోరుతో ఓడించి క్వార్టర్స్‌కు చేరింది. ప్రపంచ రెండో ర్యాంక్ క్రీడాకారిణి వాంగ్ ఇహాన్ (చైనా)ను ఢీకొనాల్సి రావడంతో సింధు సెమీస్ చేరడం అసాధ్యమన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ, క్వార్టర్స్‌లో ఇహాన్‌పై 22-20, 21-19 స్కోరుతో సంచలన విజయాన్ని నమోదు చేసిన సింధుకు సెమీస్ మొదటి రౌండ్‌లో జపాన్ క్రీడాకారిణి నజోమీ ఒకుహరా గట్టిపోటీనిచ్చింది. అయనప్పటికీ 21-19 తేడాతో ఆ గేమ్‌ను గెల్చుకున్న సింధు ఆతర్వాత పూర్తి ఆధిపత్యాన్ని కనబరచింది. అద్భుతమైన ప్లేసింగ్స్, బలమైన షాట్లతో విరుచుకుపడిన సింధు 21-10 తేడాతో రెండో గేమ్‌ను కూడా సొంతం చేసుకొని ఫైనల్‌కు చేరింది. టైటిల్ పోరులో ప్రపంచ మేటి మారిన్‌ను ఢీకొంటున్నప్పటికీ ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా సింధు అద్భుత పోరాట పటిమను కొనసాగించింది. మారిన్‌కు దీటుగా పాయింట్లను కొల్లగొట్టగలిగింది. మొదటి సెట్ ఆరంభం నుంచే ఇరువురు క్రీడాకారిణులు నువ్వానేనా అన్న చందంగా పోటీపడడంతో ప్రేక్షకులు ఉత్కంఠకు లోనయ్యారు. మొదటి సెట్ చివరిలో అద్భుతమైన ప్లేసింగ్‌తో ప్రత్యర్థిని చిత్తుచేసిన సింధు, రెండో సెట్‌లో మారిన్ ఎదురుదాడికి దిగడంతో ఆత్మరక్షణలో పడి ఒక్కో పాయింట్ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. చివరికి ఆ గేమ్‌ను మారిన్ సొంతం చేసుకోవడంతో మూడో గేమ్‌లో ఇరువురు సర్వశక్తులు ఒడ్డారు. ప్రపంచ స్థాయి పోటీల్లో ఎన్నో టైటిళ్లు గెల్చుకున్న అనుభవమున్న మారిన్ చివర్లో చెలరేగి నిర్ణాయక మూడో గేమ్‌ను కూడా గెలుచుకుని ఒలింపిక్స్ స్వర్ణ పతకాన్ని ఎగరేసుకుపోయింది. తృతీయ స్థానం కోసం జరిగిన మ్యాచ్ నుంచి చైనా క్రీడాకారిణి లీ జురుయ్ వైదొలగడంతో జపాన్ క్రీడాకారిణి నొజోమీ ఒకుహరాకు కాంస్య పతకం లభించింది.