క్రీడాభూమి

‘సింధూ.. నువ్వు దేశానికే గర్వకారణం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 19: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన భారత బాడ్మింటన్ స్టార్ యావత్ దేశానికే గర్వకారణమని పలువురు క్రీడాకారులు, ప్రముఖులు ప్రశంసించారు. సింధు రజత పతకం గెల్చుకోవడం ద్వారా భారత శక్తిసామర్థ్యాలను ప్రపంచానికి చాటి చెప్పిందని రియో ఒలింపిక్స్‌కు భారత్ తరఫున బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న మాజీ టెస్టు క్రికెటర్ సచిన్ తెండూల్కర్ ట్వీట్ చేశాడు. సింధు స్ఫూర్తి దాయక విజయం ఎంతో మందికి మార్గదర్శకం కావాలని మాజీ క్రికెటర్ వివిఎస్ లక్ష్మణ్ పేర్కొన్నాడు. తనకు పతకం రానందు బాధపడిన దానికంటే సింధుకు స్వర్ణం దక్కకపోవడంతో ఎక్కువ బాధపడ్డానని ఏస్ షూటర్ అభివనవ్ బింద్రా పేర్కొన్నాడు. అసలుసిసరైన పోరాట యోధురాలిగా సింధు తనను తాను నిరూపించుకుందని వెటరన్ టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ అన్నాడు. విజేతకూ, ఫైనలిస్టుకు తేడా చాలా స్వల్పమని, అక్కడి వరకూ వెళ్లిన సింధు సమర్థురాలని ప్రపంచ మాజీ చెస్ చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్ ఒక సందేశంలో పేర్కొన్నాడు. ఫైనల్‌లో ఓడినా అందరి మనసులు గెల్చుకుందని బిలియర్డ్స్, స్నూకర్స్ ప్రపంచ చాంపియన్ పంకజ్ అద్వానీ ప్రశంసించాడు. బాడ్మింటన్ పట్ల యువత దృష్టిని మళ్లడానికి సింధు విజయం కారణమవుతుందని ప్రొఫెషనల్ బాక్సింగ్ స్టార్ విజేందర్ సింగ్ అన్నాడు. ‘దేశానికి అసలు సిసలైన హీరోవు నువ్వే’ అంటూ కెరీర్‌లో రెండు పర్యాయాలు గ్రాండ్ శ్లామ్ టైటిళ్లను గెల్చుకున్న టెన్నిస్ స్టార్ మహేష్ భూపతి కొనియాడాడు. సింధు సాధించిన రజతం తన దృష్టిలో స్వర్ణమేనని భారత హాకీ జట్టు కెప్టెన్ శ్రీజేష్ ప్రశంసించాడు. ఇంతగా గర్వించే క్షణాలను దేశ ప్రజలకు ఇచ్చిన సింధుకు శుభాకాంక్షలు చెప్తున్నానని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ ట్వీట్ చేశాడు.