క్రీడాభూమి

అథ్లెటిక్స్‌లో ఫ్లాప్ షో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 20: అథ్లెటిక్స్ రంగంలో భారత్ ఫ్లాప్ షో కొనసాగుతున్నది. పురుషుల 50 కిలోమీరట్ల నడకలో సందీప్ కుమార్ 34వ స్థానంలో నిలిచాడు. 49 మంది రేసర్లు పోటీపడగా, సందీప్ లక్ష్యాన్ని 4 గంటల, 7.55 నిమిషాల్లో చేరాడు. స్వర్ణ పతకం సాధించిన మతేజా టోత్ (స్లొవేకియా) కంటే అతను ఏకంగా 26.57 నిమిషాలు ఆలస్యంగా రేస్‌ను పూర్తి చేశాడు. జారెడ్ టాలెంట్ (ఆస్ట్రేలియా) రజత పతకాన్ని గెల్చుకోగా, కెనడాకు చెందిన ఇవాన్ డన్ఫీ కాంస్యాన్ని అందుకున్నాడు. మహిళల 20 మీటర్ల రేస్ వాక్‌ను ఖుష్బీర్ కౌర్ 54వ స్థానంతో ముగించింది. ఆమె లక్ష్యాన్ని ఒక గంటా, 40.33 నిమిషాల్లో పూర్తి చేసింది. ఆమె గతంలో నెలకొల్పిన తన వ్యక్తిగత ఉత్తమ టైమింగ్‌ను కూడా అందుకోలేకపోవడం దురదృష్టకరం. ఖుష్బీర్‌తోపాటు పోటీపడిన స్వప్న పునియాను అనర్హురాలిగా నిర్వాహకులు ప్రకటించారు. కాగా, ఈ పోటీలో చైనాకు చెందిన లియో హాంగ్ స్వర్ణ పతకాన్ని సాధించింది. మరియా గుడాలప్ గంజాలెజ్ (మెక్సికో), లూ జుజీ (చైనా) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు.
రిలేలోనూ ఇంటికే
రిలే ఈవెంట్స్‌లోనూ భారత బృందాలు ఇంటిదారి పట్టాయి. మహిళల 4న400 మీటర్ల రిలేలో పోటీపడన భారత జట్టు 3 నిమిషాల, 29.53 సెకన్లలో గమ్యాన్ని చేరి 13వ స్థానంతో సంతృప్తి చెందింది. ఈ జట్టులో నిర్మలా షెరాన్, టింటూ లుకా, ఎంఆర్ పూవమ్మ, అనిల్డా థామస్ సభ్యులుగా ఉన్నారు. జమైకా 2 నిమిషాల 58.29 సెకన్ల టైమింగ్‌తో స్వర్ణ పతకాన్ని అందుకుంది. అమెరికా (2:58.38)కు రజతం, బెల్జియం (2:59.25)కు కాంస్య పతకం లభించాయి. పురుషుల రిలేలో భారత జట్టు అనర్హకు గురైంది. మహమ్మద్ కున్జూ, మహమ్మద్ అనాస్, అయ్యసామి ధరున్, రాజీవ్ అరోకియాతో కూడిన భారత జట్టు బాటన్ పాస్ ఆన్ చేయడంలో జరిగిన పోరపాటు కారణంగా పోటీ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.