క్రీడాభూమి

అదితి విఫలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 20: రియో ఒలింపిక్స్ తరఫున శనివారం భారత్ తరఫున బరిలో ఉన్న యువ గోల్ఫర్ అదితి అశోక్ అభిమానులను నిరాశ పరచింది. మొదటి రెండు రౌండ్స్‌లో చక్కటి ప్రతిభ కనబరచి, పతకంపై ఆశలు పెంచింది. కానీ, మూడు, నాలుగు రౌండ్స్‌లో దారుణంగా విఫలమైంది. మూడో రౌండ్ ముగిసే సమయానికి 33వ స్థానానికి పడిపోయిన ఆమె, నాలుగో రౌండ్‌లో ఆ మాత్రం రాణించలేకపోయింది. గట్టిపోటీని ఇవ్వలేక ఓటమిని అంగీకరించింది. 18 ఏళ్ల వయసులోనే ఉత్తమ గోల్ఫ్ క్రీడాకారిణిగా ఎదిగిన అదితి, మొట్టమొదటిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగింది. అయితే, అంతర్జాతీయ వేదికలపై తగినంత అనుభవం లేని కారణంగా ఆమె పూర్తి స్థాయి ఆటను ప్రదర్శించలేక నిష్క్రమించింది.