క్రీడాభూమి

దీపా కర్మాకర్‌కు ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 20: రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, అసాధారణ పోరాట పటిమను కనబరిచి అందరినీ ఆకట్టుకున్న జిమ్నాస్ట్ దీపా కర్మాకర్‌కు ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. కోచ్ బిశే్వశ్వర్ నందితో కలిసి ఇక్కడి ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకున్న త్రిపుర మణిహారం దీపను వందలాది మంది ప్రముఖులు, అభిమానులు సాదరంగా ఆహ్వానించారు. మహిళల వాల్ట్ విభాగం ఫైనల్‌లో 15.066 పాయింట్లు సంపాదించిన దీప కేవలం 0.15 పాయింట్ల తేడాతో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. అయితే, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధిస్తానని ఆమె విలేఖరులతో మాట్లాడుతూ చెప్పింది. రియోలో పతకం దక్కలేదని నిరాశ చెందానని, అయితే, ఆత్మవిశ్వాసం కోల్పోలేదని చెప్పింది. భవిష్యత్తులో దేశానికి పతకాలు సాధించి పెట్టడమే లక్ష్యంగా శ్రమిస్తానని అన్నది.

chitram.. స్వదేశానికి చేరిన దీప, కోచ్ బిశే్వశ్వర్ నంది