క్రీడాభూమి

ఫోన్‌కు, ఐస్‌క్రీమ్‌కు గ్రీన్ సిగ్నల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 20: రియో ఒలింపిక్స్ కోసం పివి సింధు ఎన్నో త్యాగాలు చేసింది. కోచ్ పుల్లెల గోపీచంద్ ఆమెకు ఫోన్ ఇవ్వలేదు. బయటకు వెళ్లడానికిగానీ, ఐస్‌క్రీమ్ వంటి చిరుతిండికి గానీ అనుమతించలేదు. ఆటపైనే దృష్టి కేంద్రీకరించాలని, ఫిట్నెస్‌ను దృష్టిలో ఉంచుకోవాలని పదేపదే చెప్తూ, 21 ఏళ్ల సింధుకు బాడ్మింటన్ కోర్టు, తన గది తప్ప మరో ప్రపంచం తెలియకుండా చేశాడు. అతని కృషి ఫలితంగానే తెలుగు తేజం సింధు బాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో ఫైనల్ వరకూ చేరింది. ప్రపంచ నంబర్ వన్ క్రీడాకారిణి కరోలినా మారిన్‌తో స్వర్ణం కోసం చివరి క్షణం పోరాడి ఓడిన సింధు రజత పతకంతోపాటు కోట్లాది మంది అభిమానుల ప్రశంసలను అందుకుంది. ఒలింపిక్స్ ఇండివిడ్యువల్ ఈవెంట్‌లో భారత్‌కు రజత పతకాన్ని సాధించిపెట్టిన తొలి క్రీడాకారిణిగా రికార్డు పుటల్లో నిలిచిన సింధు విజయం వెనుక కోచ్ గోపీచంద్ కృషి ఉంది. ఆయన మార్గదర్శకంలోనే ఆమె అంతర్జాతీయ మేటి క్రీడాకారిణిగా ఎదిగింది. ఆల్ ఇంగ్లాండ్ చాంపియన్‌షిప్‌ను గెల్చుకున్న గోపీచంద్‌కు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనే సమయంలో అనుసరించాల్సిన విధానాలు బాగా తెలుసు. అందుకే, సింధు దృష్టి ఆట నుంచి మళ్లకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. ఫిట్నెస్‌కు ప్రాధాన్యతనిచ్చాడు. సెల్ ఫోన్ వాడకం నుంచి ఇష్టానుసారంగా తినడం వరకూ అన్నిటిపైనా ఆంక్షలు విధించాడు. ఫైనల్ పోరు ముగిసింది కాబట్టి, ఆ ఆంక్షలను ఎత్తివేస్తున్నానని గోపీచంద్ అన్నాడు. గత మూడు నెలలుగా సింధుకు ఫోన్ ఇవ్వలేదని అన్నాడు. ఆమెకు ఎంతో ఇష్టమైన గడ్డ పెరుగును కూడా తినకుండా జాగ్రత్త పడ్డానని పిటిఐతో మాట్లాడుతూ చెప్పాడు. ఐస్ క్రీమ్‌ల జోలికి వెళ్లకుండా చూశానని అన్నాడు. ఒలింపిక్స్‌లో ఆమె ప్రయాణం పూర్తయింది కాబట్టి ఆటవిడుపు లభించిందని తెలిపాడు. ఫైనల్‌లో ఓటమి గురించి ఆలోచించ వద్దని సింధుకు చెప్పానని, పతకం సాధించిన విషయానే్న దృష్టిలో ఉంచుకోవాలని సూచించానని గోపీచంద్ చెప్పాడు. సింధు స్వర్ణ పతకం గెలిచి, భారత పతాకం మరింత ఉన్నతంగా రెపరెపలాడితే ఇంకా సంతోషించే వాడినని చెప్పాడు.