క్రీడాభూమి

కెనడాను వరించిన అదృష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: పురుషుల 4న100 మీటర్ల రిలేలో అదృష్టం కలిసి రావడంతో కెనడా కాంస్య పతకాన్ని సాధించింది. వాస్తవానికి అమెరికా మూడో స్థానంలో నిలిచింది. కానీ, రిలే ఈవెంట్‌లో ఒకరి నుంచి మరొకరు అందుకోవాల్సిన బాటన్ విషయంలో జరిగిన పొరపాటు అమెరికాను పతకానికి నుంచి దూరం చేసిం ది. బాటన్‌ను స్టార్ అథ్లెట్ జస్టిన్ గాల్టిన్‌కు మైక్ రోజర్స్ అందచేశాడు. అయితే, బాటన్‌ను తీసుకోక ముందే గాల్టిన్ పరుగును ఆరంభించి, ఎక్ఛ్సేంజ్ జోన్‌ను దాటేశాడు. ఈ విషయం రిప్లేలో స్పష్టంగా కనిపించడంతో నిబంధనల ప్రకారం అమెరికాపై అనర్హత వేటు పడింది. దీనితో నాలుగో స్థానంలో గమ్యాన్ని చేరిన కెనడాను అదృష్టం వరించింది. ఆ జట్టుకు కాంస్య పతకం దక్కింది.