క్రీడాభూమి

దక్కనున్న మంత్రి పదవి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో: ‘ట్రిపుల్’ హ్యాట్రిక్‌తో ఒలింపిక్స్ నుంచి నిష్క్రమించిన స్ప్రింట్ రారాజు ఉసేన్ బోల్ట్‌కు మంత్రి పదవి వరించనుంది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్స్ తర్వాత అంతర్జాతీయ కెరీర్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు బోల్ట్ ఇదివరకే ప్రకటించాడు. దీనితో అతని భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్న అభిమానులను వేధిస్తున్నది. ఒలింపిక్స్‌లో తిరుగులేని ఆధిపత్యాన్ని కనబరచిన బోల్ట్‌కు మంత్రి పదవి ఇచ్చేందుకు జమైకా ప్రధాని ఆండ్రూ హోల్నెస్ సంసిద్ధత వ్యక్తం చేశాడు. క్రీడల్లో దేశానికి కీర్తి ప్రతిష్టలను ఆర్జించిపెట్టిన బోల్ట్ సేవలు దేశానికి అవసరమని తాను భావిస్తున్నట్టు ఒక ఇంటర్వ్యూలో తెలిపాడు. బోల్ట్ స్వదేశానికి వచ్చిన వెంటనే ఈ ప్రతిపాదనను అతని ముందు ఉంచుతామని అన్నాడు.