క్రీడాభూమి

బోల్ట్ ‘ట్రిపుల్’ హ్యాట్రిక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 20: ‘జమైకా చిరుత’ ఉసేన్ బోల్ట్ ఒలింపిక్స్‌లో ‘ట్రిపుల్’ హ్యాట్రిక్‌ను పూర్తి చేసి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆధునిక ఒలింపిక్స్ చరిత్రలో వరుసగా మూడు ఒలింపిక్స్‌లో మూడేసి స్వర్ణ పతకాలను సాధించిన స్ప్రింటర్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కాడు. రియో ఒలింపిక్స్ 4న100 మీటర్ల రిలే పూర్తయిన వెంటనే తనదైన శైలిలో ‘లైట్నింగ్’ ఫోజులిచ్చిన బోల్ట్ ‘ఐ యాం ది గ్రేటెస్ట్’ అంటూ సింహనాదం చేశాడు. అలాంటి ప్రకటన చేయడానికి అతను అన్ని విధాలా అర్హుడే. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో 100 మీటర్ల పరుగులతో ప్రపంచ రికార్డు సృష్టించడంతో విశ్వక్రీడల్లో బోల్ట్ ప్రభంజనం మొదలైంది. 200 మీటర్ల పరుగు, 4న100 మీటర్ల రిలే ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలను కైవసం చేసుకొని సత్తా చాటాడు. ప్రపంచ చాంపియన్‌షిప్స్‌ను తన ఖాతాలో వేసుకుంటూ, 2012 లండన్ ఒలింపిక్స్‌లో మరోసారి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. అక్కడ కూడా 100, 200 మీటర్ల పరుగు, 4న100 మీటర్ల రిలే ఈవెంట్స్‌లో విజేతగా నిలిచాడు. అంతర్జాతీయ క్రీడా వేదికలపై తనకు తిరుగులేదని నిరూపించిన అతను రియో ఒలింపిక్స్‌లోనూ ఈ మూడు ఈవెంట్స్‌లో మరోసారి స్వర్ణాలను గెల్చుకొని ‘ట్రిపుల్’ హ్యాట్రిక్‌ను పూర్తి చేశాడు.
హోరాహోరీ పోరు
రియో ఒలింపిక్స్‌లో అంతకు ముందే 100 మీటర్లు, 200 మీటర్ల ఈవెంట్స్‌లో స్వర్ణ పతకాలను సాధించిన బోల్ట్ మరోసారి బరిలోకి దిగడంతో రిలే పోటీని తిలకించేందుకు భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. జమైకా, జపాన్, అమెరికా, కెనడా అథ్లెట్ల మధ్య పోరు హోరాహోరీగా సాగింది. ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో బోల్ట్, అసాఫా పావెల్, యహాన్ బ్లేక్, నికెల్ ఆష్మెడా సభ్యులగా ఉన్న జమైకా జట్టు రిలేను 37.27 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణ పతకాన్ని సాధించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో 36.84 సెకన్లతో ప్రపంచ రికార్డును సృష్టించిన జమైకా అదే స్థాయిలో రాణించలేకపోయినా, ప్రత్యర్థులను సమర్థంగానే అధిగమించింది. ఈ జట్టుకు చివరి క్షణం వరకూ పోటీనిచ్చిన జపాన్ 37.60 సెకన్లలో లక్ష్యాన్ని చేరి రజత పతకాన్ని అందుకుంది. ఆ జట్టులో రొటా యమగటా, షొటా లిజుకా, యొషిహిడె కిర్యు, అసుకా కేంబ్రిడ్జి సభ్యులుగా ఉన్నారు. కాగా, అకీమ్ హేన్స్, అరోన్ బ్రౌన్, బ్రెండన్ రాడ్నీ, ఆండ్రె డి గ్రేస్‌లతో కూడిన కెనడా జట్టు 37.64 సెకన్లలో ఫినిషింగ్ లైన్‌ను చేరుకొని కాంస్య పతకాన్ని అందుకుంది.
నేనే ‘ది గ్రేటెస్ట్’!
అథ్లెటిక్స్ రంగంలో తనను మించిన వారు లేరని, క్రీడల్లో ఆల్‌టైమ్ గ్రేట్ జాబితాలో తనకు తప్పక స్థానం దక్కుతుందని ‘ట్రిపుల్’ హ్యాట్రిక్ సాధించిన జమైకా సూపర్ స్టార్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ అన్నాడు. రియో ఒలింపిక్స్‌లో తాను పాల్గొంటున్న 4న100 మీటర్ల రిలే రేస్‌ను పూర్తి చేసిన తర్వాత అతను ‘నేనే గ్రేటెస్ట్’ అంటూ బిగ్గరగా అరిచాడు. తనకు ఎంతో పేరుతెచ్చిన ‘లైట్నింగ్ బోల్ట్’ ఫోజుతో అభిమానులను అలరించాడు.
రికార్డు పరుగు
ఒలింపిక్స్‌లో బోల్ట్ రికార్డు పరుగును పూర్తి చేశాడు. మూడు ఒలింపిక్స్‌లో అతను మొత్తం తొమ్మిది రేసుల్లో పాల్గొన్నాడు. అన్నింటిలోనూ స్వర్ణ పతకాలను గెల్చుకున్నాడు. ఈ ఫీట్‌ను గతంలో ఎవరూ సాధించలేదు. సమీప భవిష్యత్తులో సాధించే అవకాశాలు కూడా లేవు.