క్రీడాభూమి

బాడ్మింటన్‌పై ఆసక్తి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించిన బాడ్మింటన్ సూపర్ స్టార్ పివి సింధుపైనే దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. నిన్న మొన్నటి వరకూ ఎవరూ పట్టించుకోని బాడ్మింటన్, జిమ్నాస్టిక్స్, మహిళల రెజ్లింగ్, లాంగ్ డిస్టెన్స్ పరుగు తదితర ఈవెంట్స్ ఇప్పుడు దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బాడ్మింటన్‌పై, అందులోనూ సింధుపై చర్చ సాగుతోంది. ప్రపంచ బాడ్మింటన్ చాంపియన్‌షిప్స్, ఒలింపిక్స్ వంటి మెజర్ ఈవెంట్స్‌లో సత్తా చాటడంతో సింధు గురించి తెలుసుకోవడానికి దేశ ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. క్రికెట్ ఉక్కు పిడికిళ్ల నుంచి భారత క్రీడా రంగం బయటపడుతుందనడానికి ఇదో సంకేతం. క్రికెట్‌ను మినహాయిస్తే మరే ఇతర క్రీడకు ఆదరణ లేని దేశంలో సింధు బాడ్మింటన్‌ను కెరీర్‌గా ఎంచుకొని, అద్భుత ఫలితాలను సాధించడాన్ని అంతా ముక్త కంఠంతో ప్రశంసిస్తున్నారు. ఆమె ఇష్టాయిష్టాలను, అభిరుచులను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే లక్షల సంఖ్యలో నెటిజన్లు ఆమె ప్రొఫైల్‌ను సెర్చ్ చేశారు. దేశంలో క్రికెట్‌కు మాత్రమేగాక, ఇతర క్రీడలకూ ఆదరణ ఉంటుందనే విషయాన్ని రుజువు చేస్తున్నారు. ఈమాత్రం మద్దతు చాలు, అంతర్జాతీయ వేదికలపై ఇతర క్రీడల్లోనూ భారతీయులు రాణించడానికి. సింధుతోపాటు రెజ్లింగ్‌లో కాంస్య పతకం సాధించిన సాక్షి మాలిక్, పతకాన్ని తృటిలో చేజార్చుకున్నప్పటికీ, తన అసాధారణ పోరాట పటిమతో అందరి ఆదరాభిమానాలను సంపాదించిన దీపా కర్మాకర్ భారత క్రీడా రంగాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. సింధు తదితరులపై జరుగుతున్న చర్చ, వారి గురించి తెలుసుకోవాలన్న ఆసక్తే రానున్న రోజుల్లో చోటు చేసుకునే మార్పులను సూచిస్తున్నది.