క్రీడాభూమి

లక్ష్మణ్‌దే సూపర్ ఇన్నింగ్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 4: గత యాభై సంవత్సరాల్లో ఒక అత్యుత్తమ టెస్టు ఇన్నింగ్స్‌ను ఎంపిక చేయడం ఎవరికైనా కష్టమే. అయితే, ఇఎస్‌పిఎన్ డిజిటల్ మ్యాగజైన్ నిర్వహించిన పోలింగ్‌లో అత్యధిక శాతం మంది అభిమానులు ఆస్ట్రేలియాపై 2001లో హైదరాబాద్ స్టయిలిష్ బ్యాట్స్‌మన్ వివిఎస్ లక్ష్మణ్ కోల్‌కతాలో చేసిన 281 పరుగుల ఇన్నింగ్స్‌కే ఓటు వేశారు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల తేడాతో వెనుకబడిన భారత జట్టును రాహుల్ ద్రవిడ్‌తో కలిసి లక్ష్మణ్ ఆదుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 171 పరుగులకు ఆలౌట్‌కాగా, అందులో లక్ష్మణ్ వాటా 59 పరుగులు. రెండో ఇన్నింగ్స్‌లో అతను మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ద్రవిడ్ 180 పరుగులు చేయగా, లక్ష్మణ్ 281 పరుగులతో రాణించారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 376 పరుగులు జోడించారు. దీనితో భారత్ రెండో ఇన్నింగ్స్‌ను ఏడు వికెట్లకు 657 పరుగుల భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మొదటి ఇన్నింగ్స్‌లో 445 పరుగులు చేసిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో విఫలమైంది. 384 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, 68.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. ఓటమి అంచు నుంచి భారత్‌ను తప్పించడమేగాక, ఎవరూ ఊహించని విజయాన్ని సాధించి పెట్టిన లక్ష్మణ్ పోరాటం టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోయింది. సుమారు ఒకటిన్నర దశాబ్దాల తర్వాత అభిమానులు ఆ ఇన్నింగ్స్‌కే పట్టం కట్టారు.

బిసిసిఐ అధ్యక్షుడికి
మూడు ఓట్లు ఎందుకు?
న్యూఢిల్లీ, జనవరి 4: ప్రస్తుత నిబంధనలను అనుసరించి బిసిసిఐ అధ్యక్షుడు మూడు ఓట్లు వేసే అవకాశం ఉందని లోధా అన్నారు. తాను ప్రాతినిథ్యం వహించే క్రికెట్ సంఘం తరఫున ఒకటి, బోర్డు అధ్యక్షుడి హోదాలో మరొకటి ఓటు ఉంటుందన్నారు. అదే విధంగా ఏదైనా అంశంపై ఓటింగ్ జరిగినప్పుడు, అనుకూలంగా, ప్రతికూలంగా సమానమైన ఓట్లు వచ్చినప్పుడు కాస్టింగ్ ఓటు వేసే అధికారం కూడా అధ్యక్షుడికి ఉందన్నారు. ఒక వ్యక్తికి మూడు ఓట్లు ఎందుకని ప్రశ్నించారు. సంబంధిత క్రికెట్ సంఘం తరఫున ఒక ఓటు ఉంటే సరిపోతుందని లోధా అభిప్రాయపడ్డారు.
బిసిసిఐ పాలక మండలిలో సభ్యులుగా ఉన్నవారెవరూ రాష్ట్ర సంఘాల కార్యవర్గాల్లో సభ్యులుగా ఉండరాదని లోధా స్పష్టం చేశారు. ఒకే వ్యక్తి రెండు హోదాల్లో కొనసాగితే, ప్రచ్ఛన్న ఓటు హక్కును సంపాదించుకుంటాడని అన్నారు. దీని వల్ల బిసిసిఐ పాలన పారదర్శంగా సాగే అవకాశానికి గండి పడుతుందని పేర్కొన్నారు.