క్రీడాభూమి

యోగేశ్వర్ చిత్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రియో డి జెనీరో, ఆగస్టు 21: భారత రెజ్లింగ్ స్టార్ యోగేశ్వర్ దత్ రియో ఒలింపిక్స్ పురుషుల రెజ్లింగ్ క్వాలిఫయింగ్ రౌండ్స్‌లోనే చిత్తయ్యాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన యోగేశ్వర్ రియోలోనూ రాణిస్తాడని, ఏదో ఒక పతకాన్ని గెల్చుకుంటాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. కానీ, 65 కిలోల క్వాలిఫయింగ్ రౌండ్‌లో మంగోలియా రెజ్లర్ మందాక్నర్ గంజోరిగ్‌తో తలపడిన అతను ఏ దశలోనూ గట్టిపోటీని ఇవ్వలేకపోయాడు. పదేపదే విఫలమైన అతను చివరికి 0-3 తేడాతో ఓటమిపాలయ్యాడు.