క్రీడాభూమి

సుందర్ రామన్‌కు క్లీన్‌చిట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 4: ఐపిఎల్‌కు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సిఓఓ)గా వ్యవహరించిన సుందర్ రామన్‌కు లోధా కమిటీ క్లీన్ చిట్ ఇచ్చింది. 2013 ఐపిఎల్‌లో స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు అతను సిఓఓగా ఉన్నాడు. ఇంతకు ముందు ఐపిఎల్ స్పాట్ ఫిక్సింగ్‌పై విచారణ జరిపిన ముద్గల్ కమిటీ సుందర్ రామన్‌కు బుకీలతో బాలీవుడ్ నటుడు వినూ రణ్‌ధావా కుదుర్చుకున్న ఒప్పందం గురించిన అవగాహన ఉందని తన నివేదికలో పేర్కొంది. అయితే, లోధా కమిటీ అతనికి క్లీన్‌చిట్ ఇచ్చింది. విందూతో సంబంధాలున్నాయనిగానీ, ఫిక్సింగ్ లేదా బెట్టింగ్‌కు పాల్పడ్డానిగానీ నిరూపించే సాక్ష్యాధారాలు ఏవీ లేవని లోధా స్పష్టం చేశారు.
బెట్టింగ్‌కు చట్టబద్ధత!
బ్రిటన్ వంటి దేశాల్లో మాదిరిగానే మన దేశంలోనూ బెట్టింగ్‌ను చట్టబద్ధం చేయాలని సుప్రీం కోర్టుకు సమర్పించిన నివేదికలో లోధా కమిటీ సూచించింది. 2013 ఐపిఎల్‌లో చోటు చేసుకున్న స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్‌పై రెండు దఫాల్లో విచారణ జరిపిన ముకుల్ ముద్గల్ కమిటీ కూడా గతంలో ఇదే సూచన చేసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. బెట్టింగ్‌ను నిలువరించడం అసాధ్యమని, ఆ స్థాయిలో మానవ వనరులు కూడా లేవని లోధా కమిటీ అభిప్రాయపడింది. బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే చాలా సమస్యలకు తెరపడుందని లోధా కమిటీ పేర్కొంది. బెట్టింగ్‌ను చట్టబద్ధ చేయడానికి స్పష్టమైన విధివిధానాలను రూపొందించాల్సిన అవసరం ఉందని సూచించింది.